- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉపాధి హామీ పనుల్లో వృద్ధ జంటకు షష్టిపూర్తి.. వీడియో వైరల్
నిజామాబాద్ జిల్లా పురానిపేటలో ఉపాధి హామీ పనుల దగ్గర వృద్ధ దంపతులకు తోటి కూలీలు షష్టిపూర్తి చేశారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్.

దిశ, డైనమిక్ బ్యూరో: సోషల్ మీడియా విప్లవం పుణ్యమా అని రీల్స్ సంస్కృతి గ్రామీణ ప్రాంతాలకు చేరుకుంది. పల్లె ప్రాంతాల్లోని సామాన్యులు సైతం తాము చేసే పనులను, రోజువారీ ముచ్చట్లను వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్ చేస్తూ నెటిజన్లను అలరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఉపాధి హామీ పనులు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఉపాధి హామీ పనుల్లో వింతలు, విచిత్రాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. పని ప్రదేశంలో బతుకమ్మ ఆటలు, పెళ్లి రోజు వేడుకలు, బర్త్ డే వేడుకలతో పాటు స్థానికంగా ఆచారించే వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను రీ క్రియేట్ చేస్తూ వాటిని వీడియో తీస్తు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇప్పటికే పలు రకాల వీడియోలుచక్కర్లు కొడుతుండగా తాజాగా ఉపాధి హామీ పనుల్లో వృద్ధ దంపతులకు షష్టిపూర్తి తంతు పూర్తి చేసిన వీడియో వైరల్ అవుతోంది.
కోట్లు పెట్టిన దొరకని సంతోషం:
నిజామాబాదు జిల్లా పురానిపేట గ్రామంలో ఉపాధి హామీ పనుల్లో కూలీలు ఓ వృద్ధ జంటకు షష్టిపూర్తి కార్యక్రమం నిర్వహించారు. కూలి పనులకు హాజరైన తోట రాజన్న, తోట నర్సు దంపతులకు పని ప్రదేశంలోనే పెళ్లి పీటలపై కూర్చోబెట్టి పెళ్లి తంతు నిర్వహించారు. ఈ తంతు జరుగుతుండగా కూలీలంతా సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది. దీంతో కోట్లు పెట్టిన ఇలాంటి సంతోషం దొరకదని కొంత మంది నెటిజన్లు కామెంట్స్ చేస్తుంటే, ఈ ఏడాది ఉపాధి హామీ పథకం పని ప్రదేశాల నుంచి వస్తున్న వీడియోలపై మరికొంత మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంత పేదలకు వంద రోజుల పని కల్పించి, ఆర్థికంగా ఆదుకోవాలనే సదుద్దేశంతో ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ కార్యక్రమం అసలు లక్ష్యం పక్కదారి పడుతోందని కామెంట్స్ చేస్తున్నారు.






