విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో భారీ ప్రమాదం.. పలువురు కార్మికులకు గాయాలు

by Vemula.Srinu Prasad |

విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌లో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. కర్మాగారంలోని స్టీల్ మెల్ట్ షాప్ విభాగంలో ద్రవరూప ఉక్కును తరలిస్తున్న సమయంలో ఒక్కసారిగా ల్యాడిల్ నుంచి హాట్‌మెటల్ బకెట్లు కిందపడిపోయాయి. ..

విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో భారీ ప్రమాదం.. పలువురు కార్మికులకు గాయాలు
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌(Visakha Steelplant)లో భారీ ప్రమాదం(Accident) చోటుచేసుకుంది. కర్మాగారంలోని స్టీల్ మెల్ట్ షాప్ (SMS)-2 విభాగంలో ద్రవరూప ఉక్కును తరలిస్తున్న సమయంలో ఒక్కసారిగా ల్యాడిల్ నుంచి హాట్‌మెటల్ బకెట్లు కిందపడిపోయాయి. ఈ ఊహించని ఘటనతో వేడివేడి ద్రవం ఒక్కసారిగా చుట్టుపక్కల ప్రాంతంలో పెద్దమొత్తంలో ఒలికిపోయింది. ఆ సమయంలో అక్కడ విధుల్లో ఉన్న పలువురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి.

ఆస్పత్రికి క్షతగాత్రులు

ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన తోటి సిబ్బంది, యాజమాన్యం గాయపడిన కార్మికులను చికిత్స నిమిత్తం ప్లాంట్ ఆవరణలోని జనరల్ హాస్పిటల్‌కు తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీమ్, ఉన్నతాధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల సాంకేతిక కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు. ఈ ఘటనతో ప్లాంట్ ప్రాంగణంలో కార్మికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

Next Story