- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహిళా మంత్రిపై అసభ్యకర వ్యాఖ్యలు.. యూట్యూబర్ అరెస్ట్
తమిళనాడులో మహిళా మంత్రిపై అసభ్యకర, అవమానకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ప్రముఖ యూట్యూబర్ మరిదాస్‌ను సోమవారం మధురైలో పోలీసులు అరెస్ట్ చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తమిళనాడులో మహిళా మంత్రిపై అసభ్యకర, అవమానకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ప్రముఖ యూట్యూబర్ (YouTuber Maridhas) మరిదాస్‌ను సోమవారం మధురైలో పోలీసులు అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రి సీ. జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) ప్రభుత్వంలోని మంత్రులు, ముఖ్యంగా ఒక మహిళా మంత్రిని, ఇతర పార్టీ నేతలను లక్ష్యంగా చేసుకుని ఆయన వీడియోలు, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని పోలీసులు తెలిపారు. ఈ మేరకు చెన్నై సైబర్ క్రైమ్, మధురై పోలీసుల ప్రత్యేక బృందం సోమవారం ఉదయం ఆయన్ని అదుపులోకి తీసుకుని చెన్నైకి తరలించింది.
ప్రభుత్వ తీరుపై బీజేపీ ఫైర్
మరిదాస్ అరెస్ట్‌పై తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ ఈ అరెస్టును తీవ్రంగా ఖండించారు. టీవీకే ప్రభుత్వం విమర్శకుల గొంతు నొక్కుతోందని, తక్షణమే ఆయనను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
‘రీల్స్ మోడల్’పై విమర్శలే కారణమా?
ప్రభుత్వ అసలు రంగును, వారి ‘రీల్స్ మోడల్’ పాలనను ఎండగట్టినందుకే మరిదాస్‌పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారని నాగేంద్రన్ ఆరోపించారు. డీఎంకేకు ప్రత్యామ్నాయం అని చెప్పుకుంటూ అధికారంలోకి వచ్చిన టీవీకే ప్రభుత్వం.. ఇప్పుడు అంతకంటే దారుణంగా సామాన్యుల వాక్ స్వాతంత్య్రాన్ని హరిస్తోందని ఆయన విమర్శించారు. విమర్శకులను అణచివేయడమే సీఎం విజయ్ చెప్పిన ప్రత్యామ్నాయ రాజకీయమా అని ప్రశ్నించారు. పోలీసులను ప్రైవేట్ సైన్యంలా వాడుకుంటూ సామాన్యుల గొంతు నొక్కాలని చూస్తే బీజేపీ చూస్తూ ఊరుకోదని, వెంటనే యూట్యూబర్‌ను బేషరతుగా విడుదల చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. ప్రస్తుతం మరిదాస్‌ను విచారిస్తున్న పోలీసులు.. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇంకా అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. అయితే, ఈ అరెస్ట్ వ్యవహారం అధికార టీవీకే, విపక్ష బీజేపీ మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది.






