- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కానిస్టేబుల్ కుమారుడివా.. మరి ఎందుకు పట్టించుకోవడంలేదు: పేర్ని నాని
కానిస్టేబుల్ సమస్యలపై ఫోకస్ పెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆ మేరకు ప్రభుత్వంపై ప్రశ్నించింది. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కానిస్టేబుల్ కుమారుడు కావడంతో ఆయన్నే ఆపార్టీ నేతలు టార్గెట్ చేశారు....

దిశ, వెబ్ డెస్క్: కానిస్టేబుల్(Constable) సమస్యలపై ఫోకస్ పెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(Ysrcongress Party) ఆ మేరకు ప్రభుత్వంపై ప్రశ్నించింది. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy Cm Pawan Kalyan) కానిస్టేబుల్ కుమారుడు కావడంతో ఆయన్నే ఆపార్టీ నేతలు టార్గెట్ చేశారు. కానిస్టేబుల్ సమస్యలపై ప్రశ్నిస్తూనే సెటైర్లు వేస్తున్నారు. పవన్ కల్యాణ్ గుండె చాలా పెద్దదని అంటారని, అయితే అది గెండునా.. లేక గుండునా అని మాజీ మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేశారు. మాటకు ముందు తాను కానిస్టేబుల్ కుమారుడినని పవన్ కల్యాణ్ చెప్పుకుంటారని, కానీ వాళ్ల సమస్యలను మాత్రం పట్టించుకోరని విమర్శించారు. పోలీసుల సరెండర్ లీవులు, టీఏలపై పవన్ కల్యాణ్ ఇప్పటి వరకూ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చే వరకూ కానిస్టేబుల్ కుమారుడిననే పదాన్ని వాడుకున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా కానిస్టేబుళ్ల బాధలు సీఎం చంద్రబాబుకు, పవన్ కల్యాణ్‌కు కనిపించాలని పేర్ని నాని కోరుకున్నారు.






