భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ విషాదం.. చెరువులో 10 టన్నుల చేపలు మృతి

by Ramesh Naini |

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం భోజ్యాతండాలోని దండ్యాల చెరువులో భారీ విషాదం చోటుచేసుకుంది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ విషాదం.. చెరువులో 10 టన్నుల చేపలు మృతి
X

దిశ, డైనమిక్ బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం భోజ్యాతండాలోని దండ్యాల చెరువులో భారీ విషాదం చోటుచేసుకుంది. తీవ్రమైన ఎండల కారణంగా చెరువులో నీటి మట్టం గణనీయంగా పడిపోవడంతో, ఆక్సిజన్ అందక సుమారు 10 టన్నుల చేపలు మృత్యువాత పడినట్లు స్థానికుల సమాచారం.

చేతికొచ్చిన మత్స్య సంపద ఒక్కసారిగా కళ్లెదుటే ప్రాణాలు విడవడంతో మత్స్యకారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఊహించని ఘటనతో తమకు భారీ ఆర్థిక నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం తక్షణమే స్పందించి తగిన నష్టపరిహారం అందించి ఆదుకోవాలని వారు కోరుతున్నారు.

Next Story