నేను ఎప్పుడో హీరో అయ్యాను.. దేవి ఇప్పుడు అయ్యాడు.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన తమన్

by Pulgam srinivas |

‘ఎల్లమ్మ’ సినిమా కథ తనకు తెలుసని, ఆ చిత్రంతో దేవి శ్రీ ప్రసాద్‌కు అద్భుతమైన విజయం దక్కుతుందని తమన్ చెప్పుకొచ్చారు.

నేను ఎప్పుడో హీరో అయ్యాను.. దేవి ఇప్పుడు అయ్యాడు.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన తమన్
X

దిశ, వెబ్ డెస్క్: స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. తమన్ తాజాగా ‘ఓజీ టూర్’ కాన్సర్ట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో ముచ్చటించారు. ఈ క్రమంలో తన సహ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ హీరోగా సినిమా చేస్తున్న విషయంపై ప్రశ్నలు ఎదురయ్యాయి. “మీరు ఎప్పుడు హీరోగా సినిమా చేస్తారు?” అని జర్నలిస్టులు అడిగిన ప్రశ్నకు తమన్ ఆసక్తికరంగా స్పందించారు. తాను ఇప్పటికే ‘బాయ్స్’ సినిమాలో హీరోగా నటించినట్లు గుర్తు చేసిన ఆయన, “నేను ఎప్పుడో హీరోగా చేశాను, దేవి ఇప్పుడు హీరోగా చేస్తున్నాడు. ఆయన మనకెందుకు అలాంటి విషయాలు” అంటూ సరదాగా వ్యాఖ్యానించారు.

నటుడిగా పని చేయడం చాలా కష్టమని, ఎండలో షూటింగ్ చేయాల్సి వస్తుందని, అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పారు. సంగీత దర్శకుడిగా ఉండటం ఎంతో అదృష్టమని, ఆ సౌకర్యం దేవుడిచ్చిన వరమని తెలిపారు. దేవి శ్రీ ప్రసాద్ హీరోగా చేస్తున్న సినిమాపై తనకు పూర్తి నమ్మకం ఉందని, అది తప్పకుండా బ్లాక్‌బస్టర్ అవుతుందని తమన్ అభిప్రాయపడ్డారు. అలాగే నిర్మాత దిల్ రాజు కూడా ఆ కథ గురించి తనతో మాట్లాడారని వెల్లడించారు. అవసరమైతే ఆ సినిమాకు రెండు, మూడు పాటలు ఇవ్వడానికి కూడా సిద్ధమని ఆయన చెప్పారు. అందరూ కలిసి పనిచేస్తేనే మంచి ఫలితాలు వస్తాయని తమన్ పేర్కొన్నారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Next Story