తొలకరి పలకరింపు.. తెలంగాణను తాకిన నైరుతి రుతుపవనాలు

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-06-08 09:35:18  IST  )

రాష్ట్ర ప్రజలకు వాతావరణశాఖ చల్లని కబురునందించింది. 5 రోజుల క్రితం కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని తాకినట్లు వెల్లడించింది.

తొలకరి పలకరింపు.. తెలంగాణను తాకిన నైరుతి రుతుపవనాలు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర ప్రజలకు వాతావరణశాఖ చల్లని కబురునందించింది. 5 రోజుల క్రితం కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని తాకినట్లు వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో తొలకరి పలకరింపులు మొదలు కానున్నాయని, కొన్నిప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వివరించింది. కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఇప్పటికే నైరుతి రుతుపవనాలు పూర్తిగా విస్తరించగా.. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలలో 30 శాతం రుతుపవనాలు విస్తరించి ఉన్నాయి. దీనికితోడు బంగాళాఖాతంలోనూ నైరుతి పూర్తిగా విస్తరించినట్లు పేర్కొంది. నైరుతి రాకతో హైదరాబాద్ సహా.. పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

Next Story