ప్రీ-ప్రైమరీ ఇన్స్ట్రక్టర్, ఆయా పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ

by Batti.Sumithra |

రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన ప్రీ-ప్రైమరీ తరగతుల నిర్వహణకు కొత్తగా ఇన్స్ట్రక్టర్, ఆయా పోస్టులను భర్తీ చేస్తున్నట్లు మండల విద్యాధికారి ప్రకాష్ తెలిపారు.

ప్రీ-ప్రైమరీ ఇన్స్ట్రక్టర్, ఆయా పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ
X

దిశ, అడ్డాకుల : మండలంలోని ఐదు గ్రామాల్లో (గుడిబండ, తిమ్మాయిపల్లి తాండ, పొన్నకల్, కందూర్, కన్మనూర్) రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన ప్రీ-ప్రైమరీ తరగతుల నిర్వహణకు కొత్తగా ఇన్స్ట్రక్టర్, ఆయా పోస్టులను భర్తీ చేస్తున్నట్లు మండల విద్యాధికారి ప్రకాష్ తెలిపారు. ఒక్కో గ్రామంలో ఒక ఇన్స్ట్రక్టర్, ఒక ఆయా చొప్పున మొత్తం ఐదు గ్రామాల్లో ఐదుగురు ఇన్స్ట్రక్టర్, ఐదుగురు ఆయాలను భర్తీ చేస్తున్నట్లు తెలిపారు. అభ్యర్థులు ఆయా గ్రామాలకు చెందిన స్థానికులై ఉండాలని, ఆయాలకైతే అభ్యర్థులు కనీసం ఏడో తరగతి చదివి ఉండాలని, ఇన్స్ట్రక్టర్కైతే ఇంటర్ తో పాటు సంబంధిత ప్రీ ప్రైమరీ టీచర్ ట్రైనింగ్ ఉత్తీర్ణులై అనుభవం ఉండేవారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుందని ఎంఈఓ పేర్కొన్నారు.

సంబంధిత గ్రామంలో అర్హతలు ఉన్న వారు లభ్యం కానిపక్షంలో మండలంలోని అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని ఎంఈఓ సూచించారు. ఇన్స్ట్రక్టర్లకు నెలకు రు.8 వేలు, ఆయాలకు నెలకు రు.6 వేల గౌరవవేతనం ఉంటుందని తెలిపారు. ఆసక్తి, అర్హతలున్న అభ్యర్థులు ఈ నెల 12లోపు తమ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని ఎంఈఓ సూచించారు. దరఖాస్తు నమూనా, ఎంపిక విధానం తదితర పూర్తి వివరాలకు చెందిన దరఖాస్తులు సంబంధిత ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయుల వద్ద అందుబాటులో ఉన్నాయని, అన్ని రకాలుగా దరఖాస్తులను పూర్తి చేసి ఈ నెల 12లోపు తమ కార్యాలయంలో అందజేయాలని ఎంఈఓ తెలిపారు. మండలంలోని ఆయా గ్రామాల అభ్యర్థులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంఈఓ సూచించారు.

Next Story