- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దురదృష్టవశాత్తు కొన్ని చాన్సులు మిస్ అయ్యాయి.. తేజు అశ్విని ఎమోషనల్ కామెంట్స్
గతంలో సూపర్ హిట్ అయిన చిత్రాల్లో తనకు ఆఫర్లు వచ్చినప్పటికీ, కొన్ని కారణాల వల్ల వాటిని చేయలేకపోయానని మనసు విప్పి మాట్లాడారు.

దిశ, సినిమా: కోలీవుడ్ యంగ్ బ్యూటీ తేజు అశ్విని యూట్యూబర్‌గా కెరీర్ మొదలుపెట్టి నటనపై ఆసక్తితో నటిగా ఇండస్ట్రీకి హీరోయిన్‌గా వచ్చారు. ‘ఎన్నా సొల్ల పొగిరై’ మూవీతో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత పలు సినిమాలు చేసి ఫుల్ ఫేమ్ రాబట్టుకున్నారు. ఇటీవల ‘నవాబ్ కేఫ్’ అనే సినిమాతో ఈ అమ్మడు టాలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చారు. యంగ్ హీరో శివ కందుకూరి సరసన ఆమె నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం తేజు అశ్విని తమిళంలో ‘మూండ్రమ్ కన్’ అనే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నారు. దీనితో పాటు మరికొన్ని క్రేజీ ప్రాజెక్టులకు కూడా సైన్ చేశారు. సినిమాల్లో రాణిస్తూ బిజీగా ఉన్నప్పటికీ.. తాను కొన్ని పెద్ద చిత్రాలలో నటించే అద్భుతమైన అవకాశాలను కోల్పోయానని తేజు అశ్విని తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో సూపర్ హిట్ అయిన చిత్రాల్లో తనకు ఆఫర్లు వచ్చినప్పటికీ, కొన్ని కారణాల వల్ల వాటిని చేయలేకపోయానని మనసు విప్పి మాట్లాడారు.
"నేను కోలీవుడ్ హిట్ హర్రర్ ఫ్రాంచైజీ ‘డిమోంటే కాలనీ -2’ సినిమాలో భాగం కావాల్సింది. ఆ చిత్రంలో నటించే అవకాశం నా దాకా వచ్చింది, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ కుదరలేదు. అలాగే యువతను ఎంతగానో ఆకట్టుకున్న ‘లవర్’ చిత్రం కోసం కూడా మేకర్స్ నన్ను పరిశీలించారు. ఆ సినిమాలో హీరోయిన్ పాత్రకు నేను ఎంపికయ్యేలా కనిపించినా, దురదృష్టవశాత్తు కొన్ని కారణాల వల్ల అందులోనూ నటించలేకపోయాను" అని చెప్పారు. అలాగే ఇండస్ట్రీలో అవకాశాల గురించి మాట్లాడుతూ.. "కొన్నిసార్లు ఒక నటి ప్రయాణంలో మనకు దక్కని పాత్రలే మనల్ని ఎక్కువగా ఆలోచింపజేస్తుంటాయి. ‘ఒకవేళ ఆ పాత్ర నేను చేసి ఉంటే నా కెరీర్ ఎలా ఉండేదో’ అనే ఆలోచనలను మిగిల్చే అతిపెద్ద అంశాలుగా ఇవి మారుతుంటాయి. కానీ వాటన్నింటినీ దాటుకుని ముందుకు వెళ్లడమే ఒక నటిగా అసలైన ప్రయాణం" అని తేజు అశ్విని చెప్పుకొచ్చారు. కెరీర్ ఆరంభంలోనే ఇలాంటి మంచి హిట్ సినిమాలను కోల్పోవడం బాధాకరమే అయినప్పటికీ, భవిష్యత్తులో మరిన్ని మంచి పాత్రలతో అలరిస్తానని ధీమా వ్యక్తం చేశారు.






