- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గ్రామ అభివృద్ధికి ప్రాధాన్యత : ఎమ్మెల్యే గండ్ర
గ్రామాల అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు.

దిశ, చిట్యాల: గ్రామాల అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా చిట్యాల మండలంలోని, అందుకు తండా గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా అందుకు తండా గ్రామంలో తాగునీరు, రోడ్లు, సైడ్ డ్రైన్లు తదితర మౌలిక సదుపాయాల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని తెలిపారు. మహిళా సంఘ భవనం, అంగన్‌వాడీ భవనం నిర్మాణాన్ని మంజూరు చేయడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే రైతులకు పంటల నిర్వహణపై అవగాహన కల్పిస్తూ, పంట అవశేషాలను కాల్చకుండా భూమి సారాన్ని పెంపొందించే పద్ధతులను వివరించారు. గ్రామ అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు చేపట్టి ప్రజల సమస్యలకు పరిష్కారం చూపుతామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.






