- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చిట్‌ఫండ్ వ్యాపారం నిర్వహించిన హెడ్‌మాస్టర్ సస్పెండ్..
విధి నిర్వహణతో పాటు అనధికారికంగా చిట్‌ఫండ్ వ్యాపారం నిర్వహించినట్లు వచ్చిన ఆరోపణలు రుజువుకావడంతో సంబంధిత హెడ్‌మాస్టర్‌ను విద్యాశాఖ అధికారులు సస్పెండ్ చేశారు.

X
దిశ, నాంపల్లి: ప్రభుత్వ ఉపాధ్యాయుడు విధి నిర్వహణతో పాటు అనధికారికంగా చిట్‌ఫండ్ వ్యాపారం నిర్వహించినట్లు వచ్చిన ఆరోపణలు రుజువుకావడంతో సంబంధిత హెడ్‌మాస్టర్‌ను విద్యాశాఖ అధికారులు సస్పెండ్ చేసిన సంఘటన నాంపల్లి మండలంలోని శర్వాపురం పాఠశాలలో జరిగింది. ప్రభుత్వ ఉద్యోగ నియమావళిని ఉల్లంఘిస్తూ ఎంపీపీ ఎస్ శర్వాపురం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బెక్కం వీరయ్యపై ఆర్థిక లావాదేవీలు నిర్వహించడంపై కొందరు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు జిల్లా అధికారులు చండూరు ఆర్డీవో శ్రీదేవిని విచారణ అధికారిగా నియమించారు. విచారణలో వీరయ్యపై వచ్చిన ఆరోపణలు నిజమని తేలడంతో ఉన్నతాధికారులు సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు అనుమతి లేకుండా ఎలాంటి వ్యాపార కార్యకలాపాల్లో పాల్గొనడం నిబంధనలకు విరుద్ధమని మండల విద్యాధికారి కెఎం రావు పేర్కొన్నారు.
Next Story






