Maruti Suzuki: రూ. 2.15 లక్షల వరకు డిస్కౌంట్లు ప్రకటించిన మారుతీ సుజుకి

by S Gopi |

అమ్మకాలు పెంచుకోవడంపై దృష్టి పెట్టిన కంపెనీ తన అరెనా, నెక్సా కార్లపై భారీ తగ్గింపులు ప్రకటించింది

Maruti Suzuki: రూ. 2.15 లక్షల వరకు డిస్కౌంట్లు ప్రకటించిన మారుతీ సుజుకి
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకి జూన్ నెలకు సంబంధించి భారీ ఆఫర్లను ప్రకటించింది. అమ్మకాలు పెంచుకోవడంపై దృష్టి పెట్టిన కంపెనీ తన అరెనా, నెక్సా కార్లపై భారీ తగ్గింపులు ప్రకటించింది. ఈ ఆఫర్లలో ఎంపీవీ మోడల్ ఇన్విక్టోపై అత్యధికంగా క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్, స్క్రాపేజ్ బెనిఫిట్స్, లాయల్టీ రివార్డులు కలిపి మొత్తం రూ. 2.15 లక్షల వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి. అలాగే గ్రాండ్ విటారా స్ట్రాంగ్ హైబ్రిడ్‌పై రూ. 90,000 వరకు ఆఫర్లు, రోడ్ ట్యాక్స్ మినహాయింపులు, ఐదేళ్ల ఎక్స్‌టెండెడ్ వారెంటీ కూడా అందుబాటులో ఉన్నాయి. నెక్సా పోర్ట్‌ఫోలియోలో బలెనో, ఫ్రాంక్స్, ఇగ్నిస్, జిమ్నీ వంటి మోడళ్లపై కూడా రూ. 15,000-45,000 వరకు తగ్గింపులను కంపెనీ అందించింది. అరెనా విభాగంలో బ్రెజాపై రూ. 55,000 వరకు, వ్యాగన్ఆర్, ఆల్టో కె10పై రూ. 52,500 వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి. స్విఫ్ట్ ఏజీఎస్ వేరియంట్లపై రూ. 45,000 వరకు, పెట్రోల్, సీఎన్‌జీ వెర్షన్లపై రూ. 40,000 వరకు ఆఫర్లు ఉన్నాయి. ఎస్-ప్రెస్సో, సెలెరియో, ఈకో వంటి మోడళ్లపై కూడా ఆకర్షణీయ తగ్గింపులు ప్రకటించింది. వేరియంట్, ఇంధన రకం, కస్టమర్ కేటగిరీ ఆధారంగా ఆఫర్లలో మార్పులు ఉండొచ్చని కంపెనీ స్పష్టం చేసింది.

Next Story