కార్యదర్శిని బదిలీ చేయండి.. ఎంపీడీవోకు వినతి

by Kodari Anjali |

గ్రామ కార్యదర్శిని బదిలీ చేయాలని సర్పంచ్ ఎల్లయ్య, ఎంపీడీవో నాగవేణిని వినతిపత్రం అందజేశారు.

కార్యదర్శిని బదిలీ చేయండి.. ఎంపీడీవోకు వినతి
X

దిశ, రాజపేట: మండలంలోని బొందుగుల గ్రామ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న అబ్బురి శ్రీనివాస్‌ను బదిలీ చేయాలని సర్పంచ్ ఎల్లయ్య ఎంపీడీవో నాగవేణిని వినతిపత్రంలో సోమవారం కోరారు. గ్రామ పంచాయతి నిధులు దుర్వినియోగం చేశాడని, ప్రత్యేక అధికారి పాలన సమయంలో చేసినటువంటి పనులు, వసూలు చేసిన పన్నులు STOలో జమ చేసినటువంటి లెక్కలు చూపించకుండా గత 6 నెలలు నుండి ఇబ్బందికి గురిచేస్తున్నాడని తెలిపారు. సరైన సమయ పాలన పాటిచకుండా గ్రామ ప్రజలను అసౌకర్యానికి గురిచేస్తున్నాడని, బదిలీ చే,సి మరొక నూతన కార్యదర్శిని నియమించి, కార్యదర్శి దుర్వినియోగం చేసినటువంటి గ్రామ నిధులను రికవరీ చేయాలని కోరారు.

Next Story