దివ్యాంగులకు ట్రై సైకిల్, వీల్ చైర్ అందజేసిన కలెక్టర్

by Kodari Anjali |

పలువురు దివ్యాంగుల ఇబ్బందులపై జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ స్పందించి.. సమస్యకు పరిష్కారం చూపారు.

దివ్యాంగులకు ట్రై సైకిల్, వీల్ చైర్ అందజేసిన కలెక్టర్
X

దిశ, ఎల్లారెడ్డిపేట: పలువురు దివ్యాంగుల ఇబ్బందులపై జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ స్పందించి.. సమస్యకు పరిష్కారం చూపారు. ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లికి చెందిన ముద్రకోల దీన, ముస్తాబాద్ మండలం గూడెంకు చెందిన చింతకింది లస్మయ్య దివ్యాంగులు సోమవారం ఐడీఓసీకి రాగా, వారితో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. వారు ఎక్కడి నుంచి వచ్చారు? ఏ సమస్యపై వచ్చారో అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తక్షణమే స్పందించి.. చింతకింది లస్మయ్యకు మాన్యువల్ ట్రై సైకిల్, ముద్రకోల దీనకు వీల్ చైర్ అందజేయాలని జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజంను ఆదేశించారు. వారికి వెంటనే మాన్యువల్ ట్రై సైకిల్, వీల్ చైర్ జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ తో కలిసి అందజేశారు. తమ సమస్య, ఇబ్బందులను అర్థం చేసుకొని మానవతా దృక్పథంతో స్పందించి మాన్యువల్ ట్రై సైకిల్, వీల్ చైర్ అందించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ కు దివ్యాంగులు కృతజ్ఞతలు తెలియజేశారు.

Next Story