- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈఎస్ఐ ఆసుపత్రి సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి
రామచంద్రాపురంలోని ఈఎస్ఐ ఆసుపత్రి సమీపంలో బాలాజీ స్వీట్ హౌస్ ముందు ఓ గుర్తుతెలియని వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

దిశ, రామచంద్రాపురం : రామచంద్రాపురంలోని ఈఎస్ఐ ఆసుపత్రి సమీపంలో బాలాజీ స్వీట్ హౌస్ ముందు ఓ గుర్తుతెలియని వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పెట్రోలింగ్ ఇన్‌చార్జి నాగరాజు, అంబులెన్స్ సిబ్బందితో కలిసి ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించగా, ఆ వ్యక్తి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి వయస్సు సుమారు 40 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉండగా, ఎత్తు సుమారు 5 అడుగుల 5 అంగుళాలు, చామనచాయ రంగు, పూర్తిగా గడ్డం కలిగి ఉన్నాడు. బ్లూ జీన్స్ ప్యాంట్, తెలుపు రంగు షర్ట్ ధరించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడి వద్ద ఎలాంటి గుర్తింపు పత్రాలు లభించలేదని పేర్కొన్నారు. ఈ కేసు దర్యాప్తును హెడ్ కానిస్టేబుల్ శివలింగ ప్రసాద్‌కు అప్పగించినట్లు పోలీసులు వెల్లడించారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు లేదా కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే రామచంద్రాపురం పోలీసులను 8712567915, 8712663190 నంబర్లలో సంప్రదించి సమాచారం అందించాలని కోరారు.






