- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
HDFC Bank: కస్టమర్లకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షాక్
ముఖ్యంగా హోమ్ లోన్లు, ఆటో లోన్లు, పర్సనల్ లోన్లకు లింక్ అయి ఉండే ‘ఏడాది కాలపరిమితి వడ్డీ రేటు’ను 8.35 శాతం నుంచి 8.40 శాతానికి పెంచింది.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ అతిపెద్ద ప్రైవేట్ రంగ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కస్టమర్లకు షాకిచ్చింది. రిటైల్ లోన్‌ల వడ్డీ రేట్లను నిర్ణయించే కీలకమైన ఎంసీఎల్ఆర్ రేట్లను పెంచుతున్నట్లు సోమవారం ప్రకటించింది. కొత్త రేట్లు సోమవారం నుంచే అమల్లోకి వచ్చాయని స్పష్టం చేసింది. ముఖ్యంగా హోమ్ లోన్లు, ఆటో లోన్లు, పర్సనల్ లోన్లకు లింక్ అయి ఉండే ‘ఏడాది కాలపరిమితి వడ్డీ రేటు’ను 8.35 శాతం నుంచి 8.40 శాతానికి పెంచింది. ఇక 2 ఏళ్ల కాలపరిమితి గల లోన్లపై వడ్డీ రేటును అత్యధికంగా 8.45 శాతం నుంచి ఏకంగా 8.55 శాతానికి సవరించింది. ఈ నిర్ణయం వల్ల ఇప్పటికే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో లోన్లు తీసుకున్న వారి నెలవారీ ఈఎంఐలు పెరగడం లేదా లోన్ కట్టాల్సిన నెలల కాలపరిమితి పెరగడం ఖాయం. ప్రస్తుతం భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) తన వడ్డీ రేట్లను 5.25 శాతం వద్దే స్థిరంగా ఉంచినప్పటికీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మాత్రం వడ్డీ రేట్లను పెంచడం గమనార్హం. మరోవైపు ఓవర్‌నైట్, 3 నెలలు, 6 నెలలు, 3 ఏళ్ల కాలపరిమితి గల లోన్లపై కూడా స్వల్పంగా వడ్డీ రేట్లు పెరిగాయి. బ్యాంకింగ్ రంగంలో నిధుల నిర్వహణ ఖర్చులు (ఫండ్స్ వ్యయం) పెరుగుతుండటం వల్లే ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని బ్యాంకింగ్ విశ్లేషకులు పేర్కొన్నారు.






