అట్టహాసంగా రాకేష్ రెడ్డి ఈ-క్లాసెస్ యాప్ లాంచింగ్

by Kodari Anjali |

నిరుద్యోగులను ఉద్యోగార్థులుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు.

అట్టహాసంగా రాకేష్ రెడ్డి ఈ-క్లాసెస్ యాప్ లాంచింగ్
X

దిశ, కొత్తగూడెం ప్రతినిధి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలే లక్ష్యంగా పోటీ పరీక్షలకు సన్నదమవుతున్న విద్యార్థి, నిరుద్యోగులను ఉద్యోగార్థులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి చే ప్రత్యేకంగా రూపొందించిందే ఉచిత రాకేష్ రెడ్డి ఈ-క్లాసెస్ యాప్ ను సోమవారం కొత్తగూడెం క్లబ్ లో రాజ్యసభ ఎంపీ, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, వద్దిరాజు రవిచంద్ర చేతుల మీదుగా విడుదల చేశారు. ఉమ్మడి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల నుండి పెద్దయెత్తున తరలివచ్చిన నిరుద్యోగ యువత కాంగ్రెస్ సర్కార్ ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్ వంటి అనేక హామీలిచ్చి మాట తప్పిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ... తెచ్చుకున్న తెలంగాణలో యువత కీలక పాత్ర పోషించడం జరిగిందని, కేసీఆర్ పదేళ్ల కాలంలో సుమారు 1 లక్షా 67,000 వేల ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందని, కానీ, 420 హామీలు నిరుద్యోగ యువతకు అనేక హామీలిచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం మూడేళ్లు కావొస్తున్నా ఉద్యోగాలే ఊసెత్తడం లేదన్నారు.

కేసీఆర్ నాయకత్వంలో...

తెలంగాణ కు తెలంగాణ తెచ్చిన పార్టీనే శ్రీ రామ రక్ష అని తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండాలి, పార్లమెంట్ లో మన ఎంపీ లు ఉన్నప్పుడే మన తెలంగాణ కు న్యాయం జరుగుతుందని తెలిపారు. పార్లమెంట్ సాక్షిగా రాజ్యసభలో ముగ్గురం బీఆర్ఎస్ ఎంపీ లము ఉంటే అనేక అంశాల మీద పోరాడటం జరుగుతుందని, నిరుద్యోగ అంశంపై కూడా పోరాడుతామని భరోసా ఇచ్చారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో ముఖ్యంగా పరిశ్రమల, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కృషితో ఐటీ రంగం, ఫార్మా రంగం అత్యంత వేగంగా అభివృద్ధి చెంది దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. బీఆర్ఎస్ పార్టీ కేవలం నిరుద్యోగుల పక్షాన పోరాడటమే కాకుండా వారి ప్రిపరేషన్ లో తోడుగా ఉండటానికి బీ ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి ఈ యాప్ ను రూపొందించిన పూర్తిగా అందించడం అభినందనీయమని, అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

ఉద్యోగాలు ఇస్తామని నమ్మబలికి ఆకరికి..

ఈ సందర్భంగా రాకేష్ రెడ్డి మాట్లాడుతూ... జూన్ 2 నాడు రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ యువత కాంగ్రెస్ ప్రభుత్వం నుండి ఉద్యోగ ప్రకటన వస్తుందని ఎంతగానో ఆశించారు. కానీ, మునుపడి లాగే రేవంత్ రెడ్డి నిరుద్యోగ యువత నోట్లో మన్ను కొట్టడం దుర్మార్గమని అన్నారు. సివి ఆనంద్ ఇటీవలే పోలీస్ శాఖలో 18 వేల ఉద్యోగాలు ఉన్నాయని, ఒక్క విద్యుత్ శాఖ లోనే సుమారు 5 వేల ఉద్యోగాలు ఉన్నాయని అధికారిక లెక్క చెప్తున్నా కేవలం 5 వేల టెక్నికల్ పోలీస్ ఉద్యోగాలు మాత్రమే వేస్తామని లీకులు ఇవ్వడం దారుణమన్నారు. ఒక్క ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని నమ్మబలికి ఆకరికి మూడేళ్ల తర్వాత ఒక 5 వేలు ఇచ్చి చేతులు దులుపుకోవాలని చూస్తున్నారని, అదే జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు మెచ్చా నాగేశ్వర్ రావు, తాటి వెంకటేశ్వర్లు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దిండిగాల రాజేందర్, షైన్ ఇంటిట్యూట్ నిర్వాహకులు జలీల్, మాజీ మున్సిపల్ ఛైర్మన్ సీతా మహాలక్ష్మి, కిలారి వెంకటేశ్వర రావు, మానే రామకృష్ణ, వనమా రాఘవేంద్ర, యువనేత అనుదీప్, స్థానిక కార్పొరేటర్లు, మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు, పాల్గొన్నారు.

Next Story