- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇకపై అలాంటి పాత్రలను మాత్రమే ఎంచుకోవాలనుకుంటున్నా.. ప్రీతి ముకుందన్ ఆసక్తికర కామెంట్స్
ప్రస్తుతం నేను కాస్త నెమ్మదించి, నా సినిమాలు ప్రేక్షకులకు ఎలా నచ్చుతున్నాయో గమనిస్తున్నాను.

దిశ, సినిమా: కన్నప్ప సినిమాతో మంచి గుర్తింపు దక్కించుకున్న ప్రీతి ముకుందన్.. ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా మారిపోయారు. ఇటీవల బ్లాస్ట్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ భామ ఇప్పుడు వరుస అవకాశాలు అందుకుంటూ ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రీతి, తను నటిస్తున్న చిత్రాలు, పాత్రల ఎంపిక గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. సినిమాల ఎంపిక గురించి ప్రీతి ముకుందన్ మాట్లాడుతూ.. "నేను ఎంచుకుంటున్న కథలు చాలా కొత్తగా ఉంటున్నాయి. ఒకేలాంటి పాత్రలు కాకుండా ప్రతి మూవీలోనూ వైవిధ్యం ఉండేలా చూసుకుంటున్నాను. ‘ఇదయం మురళి’ చిత్రంలో నేను ఒక పద్ధతైన సంప్రదాయ హీరోయిన్ పాత్రలో కనిపిస్తుండగా, ‘దశమకన్’ సినిమాలో మాత్రం చాలా అమాయకపు యువతిగా నటిస్తున్నాను.
అలాగే పాపులర్ యాక్టర్ అశోక్ సెల్వన్ కాంబినేషన్‌లో చేస్తున్న మరో సినిమాలో, నేను భావోద్వేగాలతో కూడిన, చాలా మెచ్యూర్డ్ పాత్రను పోషిస్తున్నాను. వీటితో పాటు హిందీ చిత్రాల్లో కూడా నటించాలని నాకు చాలా ఆశగా ఉంది" అని చెప్పారు. తన కెరీర్ ప్లానింగ్ గురించి వివరిస్తూ.. "ప్రస్తుతం నేను కాస్త నెమ్మదించి, నా సినిమాలు ప్రేక్షకులకు ఎలా నచ్చుతున్నాయో గమనిస్తున్నాను. నా నటనను నేనే అంచనా వేసుకుని, ఆ తర్వాతే మరిన్ని కొత్త ప్రాజెక్టులను ఓకే చేయాలనుకుంటున్నాను. ఈ ఏడాది నావి కనీసం 5 నుండి 6 చిత్రాలు విడుదలవుతాయని ఆశిస్తున్నాను. సాధారణంగా ప్రేక్షకులు నన్ను గ్లామరస్ కమర్షియల్ హీరోయిన్ పాత్రల్లో చూడాలని కోరుకుంటారు. కానీ నేను మాత్రం ప్రస్తుతం అస్సలు వదులుకోకూడని అద్భుతమైన కథలను మాత్రమే ఎంచుకోవాలని ఫిక్స్ అయ్యాను" అని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.






