- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాగజ్‌నగర్‌లో మట్కా గుట్టురట్టు.. ఐదుగురు జూదరుల అరెస్ట్
పట్టణ కేంద్రంలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న మట్కా జూద స్థావరంపై పోలీసులు శనివారం మెరుపు దాడి చేశారు.

దిశ,కాగజ్‌నగర్: పట్టణ కేంద్రంలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న మట్కా జూద స్థావరంపై పోలీసులు శనివారం మెరుపు దాడి చేశారు. నమ్మదగిన సమాచారంతో గాంధీ చౌక్ ప్రాంతంలో టౌన్ పోలీసులు నిర్వహించిన ఈ ఆకస్మిక దాడిలో ఐదుగురు నిర్వాహకులు, జూదరులు పట్టుబడ్డారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ నికితా పంత్ ఆదేశాల మేరకు, కాగజ్‌నగర్ డీఎస్పీ వహీదుద్దిన్ పర్యవేక్షణలో టౌన్ సీఐ ప్రేమ్ కుమార్ నేతృత్వంలోని పోలీస్ బృందం పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద మట్కా నిర్వహిస్తున్న స్థావరంపై దాడి నిర్వహించి, ఐదుగురిని అదుపులోకి తీసుకోగా, వారి వద్ద నుంచి రూ. 4,910 నగదుతో పాటు, మట్కా నిర్వహణకు ఉపయోగిస్తున్న 5 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మట్కా ఆడుతూ పట్టుబడిన వారిలో నదిగూడకు చెందిన లారీ డ్రైవర్ లక్ష్మణ్ 60, శివాపూర్‌కు చెందిన కూలీ గులాం జిలాని 67, వంజిరికి చెందిన లారీ డ్రైవర్ పిప్రే దేవాజీ 55తో పాటు కౌసర్ నగర్‌కు చెందిన లారీ డ్రైవర్ సయ్యద్ షబీద్దీన్ 51, కూలీ సెండే సురేష్ 36 ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పట్టణంలో అక్రమ జూదం, మట్కా, గుట్కా వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాల పై ప్రత్యేక నిఘా ఉంచామని టౌన్ సీఐ ప్రేమ్ కుమార్ హెచ్చరించారు. ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ముఖ్యంగా కార్మికులు, సామాన్య ప్రజలు ఇలాంటి వ్యసనాలకు దూరంగా ఉండి, తమ కుటుంబాలను ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టవద్దని ఆయన సూచించారు.






