మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలి: సీఐటీయూ

by Kodari Anjali |

మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్న మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని సీఐటీయూ ధర్నా నిర్వహించారు.

మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలి: సీఐటీయూ
X

దిశ, కాప్రా: మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్న మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించి కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలని సీఐటీయూ మేడ్చల్ జిల్లా సహాయ కార్యదర్శి జి శ్రీనివాసులు డిమాండ్ చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో జూన్ 9వ తేదీన చేపట్టనున్న మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ ధర్నా కార్యక్రమం కరపత్రాలను సోమవారం కార్మికులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జి. శ్రీనివాసులు మాట్లాడుతూ... పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనం 26 వేల రూపాయలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, మున్సిపల్ అధికారుల వేధింపులు ఆపాలని, ప్రమాదవశాత్తు కార్మికుడు చనిపోతే కార్మిక కుటుంబం వీధిన పడే పరిస్థితి ఉంది. కావున ప్రమాద బీమాను 25 లక్షల రూపాయలు చెల్లించాలని, అదేవిధంగా కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద 15 లక్షల రూపాయలు, కార్మికులు చనిపోతే దహన సంస్కారాల కింద 30 వేల రూపాయలు చెల్లించాలని, ఇల్లు లేని ప్రతి కార్మికుడికి ఇందిరమ్మ డబుల్ బెడ్ రూమ్ ఇల్లులు కేటాయించాలని, సమయానికి జీతాలు చెల్లించాలన్నారు. తదితర డిమాండ్లతో తార్నాకలోని మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు చేపట్టనున్న ధర్నా కార్యక్రమంలో కార్మికుల పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

Next Story