- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గ్రామ సభలు ప్రజా సమస్యల పరిష్కారానికి సమర్థవంతమైన వేదికలు : అదనపు కలెక్టర్
గ్రామాల్లో ప్రజల సమస్యలను క్షేత్ర స్థాయిలో పరిష్కరించేందుకు గ్రామ సభలు సమర్థవంతమైన వేదికగా నిలుస్తాయని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు.

దిశ, చేగుంట: గ్రామాల్లో ప్రజల సమస్యలను క్షేత్ర స్థాయిలో పరిష్కరించేందుకు గ్రామ సభలు సమర్థవంతమైన వేదికగా నిలుస్తాయని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు. సోమవారం చేగుంటలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన గ్రామ సభలో జిల్లా అదనపు కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 4, 6, 8, 10 తేదీల్లో గ్రామ సభలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి గ్రామ సభలో వివిధ శాఖల అధికారులు తమ శాఖల ద్వారా అమలు చేస్తున్న కార్యక్రమాలు, ప్రజలకు అందుబాటులో ఉన్న సేవలపై అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. గ్రామ సభల ద్వారా గ్రామస్థుల సమస్యలను నేరుగా తెలుసుకొని త్వరితగతిన పరిష్కరించే అవకాశం కలుగుతుందని అన్నారు. ఎస్.ఐ.ఆర్ నమోదు ప్రక్రియ, ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో రైతులు పంటల సేద్యం పై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పారిశుధ్యం, కాలుష్య నియంత్రణ, సురక్షిత తాగు నీటి నిర్వహణ తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ చిన్న రెడ్డి, సర్పంచ్ స్రవంతి, పాలక వర్గ సభ్యులు సంబంధిత శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.






