హెచ్ ఫాస్ట్ పోలీసుల భారీ ఆపరేషన్.. 9 లారీల చికెన్ వ్యర్థాలు సీజ్

by Naga Rani Yarlagadda |

హైదరాబాద్‌లో హెచ్ ఫాస్ట్ పోలీసులు భారీ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. చికెన్ వ్యర్థాలను తరలిస్తోన్న 9 లారీలను పోలీసులు సీజ్ చేశారు.

హెచ్ ఫాస్ట్ పోలీసుల భారీ ఆపరేషన్.. 9 లారీల చికెన్ వ్యర్థాలు సీజ్
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో హెచ్ ఫాస్ట్ పోలీసులు భారీ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. చికెన్ వ్యర్థాలను తరలిస్తోన్న 9 లారీలను పోలీసులు సీజ్ చేశారు. 120 టన్నుల వ్యర్థాలను స్వాధీనం చేసుకుంది. ఈ వ్యర్థాలను చెరువల్లో చేపలకు ఆహారంగా వాడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. జీహెచ్ఎంసీ పరిధిలో సేకరించే చికెన్ వ్యర్థాలను శాస్త్రీయంగా నిర్వీర్యం చేసేందుకు గుర్తింపుపొందిన రెండరింగ్ ప్లాంట్ కు తరలించాల్సి ఉంటుంది. కానీ.. కొందరు వ్యక్తులు ఆ నిబంధనలను తుంగలో తొక్కి.. చికెన్ వ్యర్థాలను భారీమొత్తంలో ఆంధ్రప్రదేశ్ కు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఏపీలోని గుంటూరు, వినుకొండ, అద్దంకి, భీమవరం ప్రాంతాల్లోని చెరువుల్లో పెంచుతున్న చేపలకు ఈ వ్యర్థాలను ఆహారంగా వేసేందుకు రవాణా చేస్తున్నట్లు హెచ్ ఫాస్ట్ పోలీసులకు సమాచారం అందింది. వెంటనే ఆ లారీలను తనిఖీ చేసి.. 120 టన్నుల చికెన్ వ్యర్థాలను స్వాధీనం చేసుకున్నారు. చికెన్ వ్యర్థాలను తిని పెరిగిన చేపలను మనుషులు ఆహారంగా తీసుకుంటే తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని, ఇది ప్రజారోగ్యానికి ఎంతో ప్రమాదకరమని పోలీసులు స్పష్టం చేశారు. ఈ వ్యర్థాల తరలింపు వెనుక ఉన్న సూత్రధారులపై నిఘాపెట్టి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story