- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎండల వేళ ఉపాధి హామీ కార్మికుల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి
మహమ్మదాబాద్ మండలంలోని నంచర్ల గ్రామంలో నాయకమ్మ చెరువు వద్ద ఉపాధి హామీ పనులు చేస్తున్న కార్మికులకు సోమవారం ఆశావర్కర్లు ఆరోగ్య అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

దిశ, మహమ్మదాబాద్ : మహమ్మదాబాద్ మండలంలోని నంచర్ల గ్రామంలో నాయకమ్మ చెరువు వద్ద ఉపాధి హామీ పనులు చేస్తున్న కార్మికులకు సోమవారం ఆశావర్కర్లు ఆరోగ్య అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో కార్మికులు వడదెబ్బ, నీరసం వంటి సమస్యలకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్లు ఎం.భారతమ్మ, వి. మౌనికలు కార్మికులకు ఓఆర్ఎస్ ప్యాకెట్లను పంపిణీ చేసి వాటి వినియోగం పై వివరించారు. ఎండలో పనిచేసే సమయంలో తరచూ నీరు తాగడం, ద్రవాహారం తీసుకోవడం, తలకు రక్షణగా గుడ్డ లేదా టోపీ ధరించడం వంటి జాగ్రత్తలు పాటించాలని సూచించారు. వడదెబ్బ లక్షణాలు కనిపించిన వెంటనే సమీప ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని తెలిపారు. కార్మికుల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆశావర్కర్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ కార్మికులు పాల్గొన్నారు.






