- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పరస్పర అంగీకారంతో శారీరక బంధం తప్పుకాదు: సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు
వయోజనులు పరస్పర అంగీకారంతో శారీరక సంబంధం పెట్టుకుంటే తప్పుకాదని సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది.

దిశ, వెబ్‌డెస్క్: వ్యక్తిగత స్వేచ్ఛ, నైతికతకు సంబంధించి దేశ అత్యున్నత న్యాయస్థానం (Supreme Court) మరో సంచలన తీర్పును వెలువరించింది. ఇద్దరు మేజర్లు పరస్పర అంగీకారంతో శారీరక సంబంధం పెట్టుకుంటే దానిని చట్టపరంగా తప్పుగా చూడలేమని అత్యున్నత ధర్మాసనం స్పష్టం చేసింది. కేవలం వ్యక్తిగత సంబంధాల ఆధారంగా ఓ వ్యక్తి క్యారెక్టర్‌ను తప్పుబట్టలేమని, అది వారికి రాజ్యాంగం కల్పించిన హక్కు అని తేల్చి చెప్పింది. తెలంగాణకు చెందిన ఓ ట్రైనీ పోలీస్ కానిస్టేబుల్ పోస్టింగ్ వివాదంపై విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ఇవాళ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
అసలు ఏం జరిగిందంటే..
తెలంగాణ(Telangana)కు చెందిన గాజుల తిరుపతి (Gajula Tirupati) అనే వ్యక్తి ట్రైనీ పోలీస్ కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడు. అయితే, 2014లో అతడు ఓ యువతితో శారీరక సంబంధం పెట్టుకున్నాడనే ఆరోపణలు వచ్చాయి. దీంతో తిరుపతి ప్రవర్తన (Character) సరిగ్గా లేదంటూ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు అతడికి పోస్టింగ్ ఇవ్వడానికి నిరాకరిస్తూ నియమక పత్రాన్ని కూడా ఇవ్వలేదు. అయితే, అభ్యర్థి తిరుపతి తనకు పోస్టింగ్ ఇవ్వాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం అభ్యర్థి తిరుపతికి అనుకూలంగా తీర్పునిచ్చింది. ఇద్దరు మేజర్లు తమ పరస్పర అంగీకారంతో శారీరక బంధాన్ని కలిగి ఉంటే, దానిని నేరంగా పరిగణించలేమని.. ప్రేమల్లో ఉన్న ప్రతి బంధం పెళ్లి వరకు వెళ్లకపోవచ్చని, అందులో ఏముందని కోర్టు స్పష్టం చేసింది. ఒకే ఒక్క రీజన్‌తో వ్యక్తి నడవడిక, క్యారెక్టర్‌పై నెగటివ్‌గా ముద్ర వేయలేమని.. నైతికత, చట్టం వేర్వేరని, వ్యక్తిగత ఇష్టాయిష్టాలు ఉద్యోగ అర్హతలను శాసించలేవని ధర్మాసనం అభిప్రాయపడింది.
పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డుకు స్పష్టమైన ఆదేశాలు..
వాదనల అనంతరం సుప్రీంకోర్టు గాజుల తిరుపతికి తక్షణమే పోస్టింగ్ ఉత్తర్వులు జారీ చేయాలని పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డును ఆదేశించింది. అదేవిధంగా భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని పోలీస్ రిక్రూట్‌మెంట్ తరఫు న్యాయవాదికి ధర్మాసనం చీవాట్లు పెట్టింది. తిరుపతి కేసులో తాజాగా వెలువడిన చారిత్రాత్మక తీర్పుతో దేశవ్యాప్తంగా క్యారెక్టర్ వెరిఫికేషన్ నిబంధనలపై సరికొత్త డిబేట్ మొదలైంది.






