ఆక్వా రైతులకు గుడ్ న్యూస్.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

by Vemula.Srinu Prasad |

పశ్చిమగోదావరి జిల్లాలో ఆక్వా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అసలే అంతంత మాత్రంగా ఉన్న వారి మనుగడపై అమెరికా విధించిన సుంకాలు మారింత కోలుకోని దెబ్బ కొట్టాయి..

ఆక్వా రైతులకు గుడ్ న్యూస్.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: పశ్చిమగోదావరి జిల్లా(West Godavari District)లో ఆక్వా రైతులు(Aqua Farmers) తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అసలే అంతంత మాత్రంగా ఉన్న వారి మనుగడపై అమెరికా(America) విధించిన సుంకాలు మారింత కోలుకోని దెబ్బ కొట్టాయి. దిగుమతులు ఎలా ఉన్నా గాని.. ఎగుమతుల విషయంలో మాత్రం తీవ్రమైన భారం పడింది. దీంతో ఆక్వా రైతులు ఒక్కసారిగా కుదేలయిపోయారు. దీంతో తమ సమస్యలను ప్రభుత్వానికి పలుమార్లు చెప్పుకుని ఆక్వా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అప్పటి నుంచి కూడా సమస్య పరిష్కారంపై వారికి ప్రభుత్వం హామీ ఇస్తూ వచ్చింది. అయితే ఈ రోజు మాత్రం త్వరలోనే ఆక్వా రైతుల సమస్యను పరిష్కరించబోతున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు పశ్చిమగోదావరి జిల్లా సిద్ధాంతం వేదికగా చంద్రబాబు వెల్లడించారు.

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌తో..

అలాగే గత ప్రభుత్వం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తీసుకొచ్చి చేసిన నష్టంపైనా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఆధీనంలో ఉండాల్సిన భూ రికార్డులను గత ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టిందని ఆరోపించారు. అంతేకాదు రైతులకు సంబంధించిన భూములపై జగన్ ఫొటో వేసుకున్నారని మండిపడ్డారు. భూ సమస్యల పరిష్కారానికి బ్లాక్ చైన్ టెక్నాలజీని తీసుకొచ్చామని చెప్పారు. QR కోడ్‌తో రాజముద్ర కలిగిన పుస్తకాలను రైతులకు అందజేస్తున్నామని తెలిపారు. ఇక నుంచి రైతుల భూ రికార్డులను ఎవరూ ట్యాంపరింగ్ చేయలేరని చంద్రబాబు స్పష్టం చేశారు.

రీ సర్వే భూ రికార్డుల అప్ డేట్

రీ సర్వేలో ఈకేవైసీ పెట్టి రైతులకు భాగస్వామ్యం కల్పించామన్నారు. 6, 668 గ్రామాల్లో రీ సర్వే పూర్తి చేసి భూ రికార్డులను అప్ డేట్ చేశామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఇప్పటి వరకూ దాదాపు 26 లక్షల పాస్ పుస్తకాలను రైతులకు అందజేశామని తెలిపారు. నిషేధిత జాబితా 22ఏలోని భూముల సమస్యలను పరిష్కరిస్తున్నామన్నారు. ఓ వ్యక్తి చేసిన దుర్మార్గాలను సరి చేసేందుకు తమకు రెండేళ్లు పట్టిందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

Next Story