టీఎంసీకి భారీ షాక్.. పార్టీకి, రాజ్యసభ సభ్యత్వానికి సుఖేందు శేఖర్ రాయ్ రాజీనామా

by Malleboina Mahesh |

తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నేత సుఖేందు శేఖర్ రాయ్ టీఎంసీ పార్టీకి, తన రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేశారు.

టీఎంసీకి భారీ షాక్.. పార్టీకి, రాజ్యసభ సభ్యత్వానికి సుఖేందు శేఖర్ రాయ్ రాజీనామా
X

దిశ, వెబ్ డెస్క్: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత టీఎంసీ పార్టీ (TMC party)కి భారీ షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీలో చీలికలు రాగా.. తాజాగా మరో ఊహించని షాక్ తగిలింది. టీఎంసీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ సుఖేందు శేఖర్ రాయ్ (Sukhendu Shekhar Roy) పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఈ రోజు ఉదయం.. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయడంతో పాటు తన రాజ్యసభ ఎంపీ పదవికి కూడా ఆయన రాజీనామా సమర్పించారు. గత కొన్ని రోజులుగా టీఎంసీ పార్టీ అంతర్గత వ్యవహారాలు, పనితీరుపై సుఖేందు శేఖర్ రాయ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీలో నాయకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి సరైన అవకాశం లేకుండా పోయిందని, తాము పార్టీలో సంతోషంగా లేమని ఆయన వ్యాఖ్యానించారు.

2011 నుండి టీఎంసీ తరపున రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తున్న సుఖేందు శేఖర్ రాయ్ రాజీనామా మమతా బెనర్జీ నేతృత్వంలోని పార్టీకి జాతీయ స్థాయిలో పెద్ద షాక్ అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గత కొంత కాలంగా శారీరకంగా పార్టీలో ఉన్నప్పటికీ, మానసికంగా ఎప్పుడో దూరమయ్యానని ఇటీవలే ఆయన స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే బెంగాల్ రాజకీయాలో మంచి అనుభవం ఉన్న సుఖేందు శేఖర్ రాయ్ తదుపరి రాజకీయ అడుగులు ఎటువైపు ఉంటాయనే దానిపై ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Next Story