ఆ బాధ్యత మాది: పశ్చిమగోదావరి జిల్లా ప్రజలకు చంద్రబాబు భరోసా

by Vemula.Srinu Prasad |

సీఎం చంద్రబాబు నాయుడు పశ్చిమగోదావరి జిల్లా సిద్ధాంతంలో పర్యటించారు. ఈ సందర్బంగా జిల్లాలోని భూ సమస్యలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ..

ఆ బాధ్యత మాది: పశ్చిమగోదావరి జిల్లా ప్రజలకు చంద్రబాబు భరోసా
X

దిశ, వెబ్ డెస్క్: సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) పశ్చిమగోదావరి జిల్లా(West Godavari District) సిద్ధాంతం(Siddantam)లో పర్యటించారు. ఈ సందర్బంగా జిల్లాలోని భూ సమస్యలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా అంటే తనకు ప్రత్యేకమైన ప్రేమ, అభిమానం ఉన్నాయన్నారు. ఆక్వా రైతుల(Aqua farmers) సమస్యల పరిష్కారింపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామని చెప్పారు. గత ప్రభుత్వం రాష్ట్రంలో ల్యాండ్ సర్వే(Land Survey) పేరుతో రైతుల మధ్య చిచ్చుపెట్టిందని తెలిపారు. అప్పట్లో నిజాం(Nizam) పరిపాలనలో తెలంగాణ(Telangana) ప్రాంతంలో భూ సమస్యలు చాలా ఉండేవన్నారు. కానీ ఏపీలో మాత్రం చాలా తక్కువగా ఉండేవని చంద్రబాబు గుర్తు చేశారు. గత ప్రభుత్వం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తీసుకొచ్చి రాష్ట్రంలో విధ్వంసం సృష్టించిందని చెప్పారు. దెబ్బతో లెక్కలేనన్ని రెవెన్యూ సమస్యలు వచ్చి పడ్డాయన్నారు. ఆ సమస్యలన్ని పరిష్కరిస్తూ రాజముద్రతో పాస్ పుస్తకాలు ఇస్తున్నామని చెప్పారు. ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేలను ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నామని చంద్రబాబు పేర్కొన్నారు.

Next Story