- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాగబాబు, ప్రకాశ్ రాజ్ మధ్యలోకి దూరిన RGV.. మెగా క్యాంప్‌పై ఎటాక్.. ఇంతటితో ఆగేనా?
జనసేన వివాదంలోకి ఆర్జీవీ ఎంట్రీ ఇచ్చారు. నాగబాబు, ప్రకాశ్ రాజ్ ట్విట్టర్ వార్ నడుస్తున్న వేళ ప్రకాశ్ రాజ్ కు ఆర్జీవీ మద్దతు గా ట్వీట్ చేయడం ఆసక్తిగా మారింది.

దిశ, డైనమిక్ బ్యూరో: రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారిన జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అంశం ఇప్పుడు సినిమా రంగంలో దుమారం రేపుతోంది. ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొ.నాగేశ్వర్ చేసిన ఓ విశ్లేషణకు పవన్ కల్యాణ్ ఇచ్చిన రియాక్షన్, ఆ తర్వాత తెలంగాణలో పవన్ కల్యాణ్ నిర్వహించిన ప్రెస్ మీట్‍తో ఈ వివాదం చిలికి చిలికి గాలివానలా మారింది. రాజకీయ వర్గాలతో పాటు తాజాగా సిని ఇండస్ట్రీలో మాటల యుద్ధానికి దారి తీసిన ఈ వివాదంలోకి తాజాగా ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎంట్రీ ఇచ్చారు. జనసేన ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నాగబాబుకు, నటుడు ప్రాకాశ్ రాజ్‍కు మధ్య సాగుతున్న డైలాగ్ వార్‍లోకి ఆర్జీవీ పరకాయప్రవేశం చేయడంతో ఈ వివాదం ఇంకెటువైపు మళ్లుతుందో అనే చర్చ తెలుగు సినీ, రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది.
ప్రకాశ్ రాజ్‌కు మద్దతుగా ఆర్జీవీ:
సినిమాలతో పాటు సామాజిక, రాజకీయ అంశాలపై తరచూ స్పందించే ఆర్జీవీ గత కొంతకాలంగా సైలెంట్‍గా ఉంటున్నారు. తాజాగా నాగబాబు వేసిన ఓ ట్వీట్ పై ప్రకాశ్ రాజ్ కౌంటర్ ఇవ్వడంతో నాగబాబు వర్సెస్ ప్రకాశ్ రాజ్ మధ్య వివాదం మొదలైంది. ఇటీవల పవన్ కల్యాణ్ ఫొటోను జత చేస్తూ.. "నాయకుడి మాటే శిరోధార్యం. ఏది సరైనదో, ఏది కాదో నాయకుడికే బాగా తెలుసు. అనుమానాలను పక్కనపెట్టి, ఎలాంటి ప్రశ్నలు వేయకుండా నాయకుడిని గుడ్డిగా అనుసరించాలి" అనే అర్థం వచ్చేలా నాగబాబు ట్వీట్ చేశారు వ్యాఖ్యలు చేశారు. నాగబాబు చేసిన ట్విట్ కు ప్రకాశ్ రాజ్ వెంటనే స్పందిస్తూ కౌంటర్ వేశారు. మేము గొర్రెలం కాదు, బానిసలమూ కాదు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు. ప్రజాప్రతినిధిగా ఎన్నికైన ఏ నాయకుడైనా ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిందే అంటూ ప్రకాశ్ రాజ్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. ప్రకాశ్ రాజ్ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ప్రజాస్వామ్య హక్కులను ప్రస్తావించడంతో నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయి కామెంట్ల రూపంలో వాదించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రకాశ్ రాజ్ చేసిన ట్వీట్ పై తాజాగా రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు తమ సమస్యలను పరిష్కరిస్తాడనే నమ్మకంతో ఒక నాయకుడికి బాధ్యతాయుతమైన పదవిని అప్పగిస్తారు. అతనికి రాజుగా పట్టాభిషేకం చేయరు అంటూ ట్వీట్ చేశారు. నాగబాబు-ప్రకాశ్ రాజ్ మధ్య జోరుగా ట్విట్టర్ వార్ నడుస్తున్న తరుణంలో ఆర్జీవీ చేసిన తాజా వ్యాఖ్యలు మరోసారి రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఆర్జీవీ వ్యాఖ్యలకు కొందరు మద్దతు తెలుపుతుండగా, మరికొందరు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం సోషల్ మీడియాలో మరింత హాట్ టాపిక్‌గా మారింది.
ఇంకెటు వైపు మళ్లుతుందో..?
ప్రొఫెసర్ నాగేశ్వర్ విశ్లేషణతో మొదలైన ఈ వివాదం పవన్ కల్యాణ్ ప్రెస్ మీట్ తో తెలంగాణ వర్సెస్ ఆంధ్రగా మారింది. ఈ క్రమంలో ప్రకాశ్ రాజ్ వర్సెస్ బండ్ల గణేశ్ మధ్య సాగిన డైలాగ్ వార్ ఇప్పుడు నాగబాబు, ప్రకాశ్ రాజ్ మధ్యకు మళ్లింది. వీరిద్ధరి మధ్య వివాదం మరింత ముదురుతున్న తరుణంలో ఈ కాంట్రవర్సీలోకి ఆర్జీవీ ఎంట్రీ ఇవ్వడం హాట్ టాపిక్ అవుతోంది. గతంలోనూ మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ వరుస సినిమాలు, ట్వీట్లు చేసిన ఆర్టీవీ ఇప్పుడు మళ్లీ నాగబాబు-ప్రకాశ్ రాజ్ వివాదం కారణంగా మెగా క్యాంప్‌ను టార్గెట్ చేయడం సంచలనంగా మారుతోంది. నాగబాబు-ప్రకాశ్ రాజ్- ఆర్జీవీ మధ్యకు మళ్లిన ఈ వివాదం అంతిమంగా ఎటువైపు మళ్లుతుందో చూడాలి.






