- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్ పార్టీలో 50 కుటుంబాల చేరిక
దశాబ్దాలుగా మా ప్రాంతంలో జరగని అభివృద్ధి.. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వచ్చిన తర్వాతే కళ్లముందు సాక్షాత్కరిస్తోంది పలువురు నేతలు పేర్కొన్నారు.

దిశ, ఖమ్మం రూరల్: దశాబ్దాలుగా మా ప్రాంతంలో జరగని అభివృద్ధి.. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వచ్చిన తర్వాతే కళ్లముందు సాక్షాత్కరిస్తోంది పలువురు నేతలు పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో అర్హులకు ప్రాధాన్యత ఇవ్వడం, మా పొన్నేకల్ గ్రామంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన 'యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్' నిర్మిస్తుండటమే ఇందుకు నిదర్శనం. మా గ్రామానికి, మా ప్రాంతానికి మంత్రి పొంగులేటి ఇస్తున్న ఈ ప్రత్యేక ప్రాధాన్యతను గుర్తించే మేమంతా కాంగ్రెస్ బాట పట్టామని పార్టీలో చేరిన పలువురు నేతలు అన్నారు.
సోమవారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయం వేదికగా ఖమ్మం రూరల్ మండలం లో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్, సీపీఎం సహా వివిధ పార్టీలకు చెందిన సుమారు 50 కుటుంబాల వారు కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమానికి, పొంగులేటి అభివృద్ధికి ఆకర్షితులై పార్టీలో చేరారు. క్యాంప్ కార్యాలయ ఇన్‌ఛార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి వీరందరికీ కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి, సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పొన్నేకల్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఈ చేరికల ప్రక్రియ విజయవంతంగా సాగింది.
తరలివచ్చిన కుటుంబాలు..
కాంగ్రెస్ గూటికి చేరిన వారిలో రాయల సైదులు, మారపొంగు నరేష్, సిరిపల్లి లక్ష్మయ్య, గార్లపాటి ఉపేందర్, వరగాని ఉపేందర్ కుటుంబాలతో పాటు సుమారు 50 కుటుంబాల వారు ఉన్నారు. దశాబ్దాల వెనుకబాటుకు పొంగులేటి చొరవతోనే మోక్షం లభిస్తుందని నమ్మి, తమ గ్రామాభివృద్ధి కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఖమ్మం రూరల్ మండల అధ్యక్షుడు తోట వీరభద్రం, కళ్ళెం వెంకట్ రెడ్డి, మద్ది మల్లారెడ్డి, మద్ది వీరారెడ్డి, ముత్యం చిన్ని కృష్ణారావు, ఖమ్మం రూరల్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోటి రమణ, గ్రామ శాఖ అధ్యక్షుడు వంగూరి రవి, లింగా శ్రీనివాస్, గునిగంటి రమేష్, తేళ్లపూడి శ్రీనివాస్, వరగాని శ్రీనివాస్, కోట వెంకటేశ్వర్లు, పొన్నేకంటి ఉపేందర్, పెద్దపొంగు ఉపేందర్, మోరు రమేష్, మురకొండ వెంకటేశ్వర్లు, వరగాని నాగేశ్వరరావు, బొడ్డు హనుమంతు, కొత్తా గురవయ్య తదితరులు పాల్గొన్నారు.






