ఆ ప్రముఖ సంస్థ చేతికి వృషకర్మ నాన్-థియేట్రికల్ హక్కులు

by Pulgam srinivas |

ఈ సినిమా నాన్-థియేట్రికల్ హక్కులను జీ సంస్థ భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు సమాచారం.

ఆ ప్రముఖ సంస్థ చేతికి వృషకర్మ నాన్-థియేట్రికల్  హక్కులు
X

దిశ, వెబ్ డెస్క్: అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మైథలాజికల్ థ్రిల్లర్ ‘వృషకర్మ’ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి కథానాయికగా కనిపించనుంది. ‘తండేల్’ విజయం తర్వాత నాగచైతన్య నటిస్తున్న సినిమా కావడం, అలాగే ‘విరూపాక్ష’ వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత కార్తీక్ దండు తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, ఈ మూవీకి సంబంధించిన నాన్-థియేట్రికల్ డీల్ ఇప్పటికే క్లోజ్ అయినట్లు తెలుస్తోంది. ప్రముఖ జీ సంస్థ ఈ సినిమా నాన్-థియేట్రికల్ హక్కులను భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు సమాచారం. స్పర్శ్ శ్రీవాత్సవ్ ఈ చిత్రంలో విలన్ పాత్రలో కనిపించనుండగా, జయరామ్ కీలక పాత్రలో నటించనున్నారు. బి. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు సుకుమార్ కథను అందించారు. బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్, సుకుమార్ సంయుక్తంగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర మరియు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Next Story