- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘పెద్ది’ సక్సెస్ మీట్ అప్‌డేట్.. రామ్ చరణ్ స్పీచ్ హైలెట్ కానుందా?
ఈరోజు హైదరాబాద్‌లో ‘పెద్ది’ సక్సెస్ మీట్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా ‘పెద్ది’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించాడు. జూన్ 4న విడుదలైన ఈ సినిమా ఇప్పటికే రూ. 292.5 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈరోజు వర్కింగ్ డే అయినప్పటికీ చిత్రానికి మంచి బుకింగ్స్ నమోదవుతున్నట్లు సమాచారం. దీంతో లాంగ్ రన్‌లో ఈ సినిమా భారీ వసూళ్లు సాధించే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే భారీ కలెక్షన్లతో విజయవంతంగా దూసుకుపోతున్న నేపథ్యంలో, ఈ మూవీ బృందం ఈరోజు సాయంత్రం హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
ఈ కార్యక్రమానికి రామ్ చరణ్ కూడా హాజరయ్యే అవకాశమున్నట్లు సమాచారం. సినిమా విడుదలకు ముందు రామ్ చరణ్, ఇది తన కెరీర్‌లోనే బెస్ట్ ఫిల్మ్ అవుతుందని చెప్పిన విషయం తెలిసిందే. అయితే, ఈ చిత్రంలో రామ్ చరణ్ నటన, కష్టంపై ప్రశంసలు వస్తున్నప్పటికీ, ఓవరాల్‌గా సినిమా ‘మగధీర’, ‘రంగస్థలం’, ‘ఆర్ఆర్ఆర్’ స్థాయిలో లేదనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సక్సెస్ మీట్‌లో రామ్ చరణ్ ఈ విమర్శలపై స్పందిస్తారా లేదా అనే ఆసక్తి ఇండస్ట్రీ వర్గాల్లో నెలకొంది. ఏదేమైనా, ‘పెద్ది’ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద బలమైన వసూళ్లతో భారీ విజయం దిశగా సాగుతోంది.






