- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘దిశ’ కథనాలతో కదిలిన జిల్లా యంత్రాంగం.. పేదలకు డబుల్ ఇళ్లు
ఆదిలాబాద్ పట్టణంలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపుల్లో చోటు చేసుకున్న అవినీతి, అక్రమాలపై "దిశ పత్రిక"లో వరుస కథనాలు రావడంతో అధికార యంత్రాంగం స్పందించింది.

దిశ,ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపుల్లో చోటు చేసుకున్న అవినీతి, అక్రమాలపై "దిశ పత్రిక"లో వరుస కథనాలు రావడంతో అధికార యంత్రాంగం స్పందించింది. అర్హులైన పేదలకు న్యాయం జరిగేలా ప్రత్యేక విచారణ చేపట్టి డబుల్ ఇళ్లు అందించే దిశగా చర్యలు ప్రారంభించింది. ఇటీవల డబుల్ ఇళ్ల ఎంపికలో తమకు అన్యాయం జరిగిందని పలువురు పేద మహిళలు, కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. తాము అన్ని అర్హతలూ ఉన్నప్పటికీ జాబితాలో పేర్లు లేకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ‘దిశ’ ప్రతినిధితో తమ గోడు వెళ్లబోసుకున్నారు.
ఈ అంశంపై ‘దిశ’ పత్రిక వరుస కథనాలు ప్రచురించడంతో విషయం అధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి అర్హుల జాబితాను మరోసారి పరిశీలించారు. అనర్హులను తొలగించి నిజమైన పేదలకు డబుల్ ఇళ్లు అందేలా చర్యలు తీసుకోవడం ప్రారంభించారు. దీంతో ఇప్పటివరకు ఇళ్లు రాక ఇబ్బందులు పడుతున్న పలువురు పేద కుటుంబాల్లో ఆనందం నెలకొంది. "దిశ పత్రిక" తమ సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చి న్యాయం జరిగేలా చేసినందుకు పలువురు లబ్ధిదారులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల సమస్యలను బయటపెట్టి పేదలకు అండగా నిలిచిన ‘దిశ’ పాత్ర అభినందనీయమని పేర్కొన్నారు.






