క్యాబ్ డ్రైవర్‌ను చితకబాదిన నటుడు సుప్రీత్.. కీసర పీఎస్‌లో కేసు నమోదు

by Kema Shiva Kumar |   (  Updated:2026-06-08 07:00:26  IST  )

టాలీవుడ్ నటుడు సుప్రీత్ అలియాస్ కాట్రాజ్ ఓ క్యాబ్ డ్రైవర్‌పై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు.

క్యాబ్ డ్రైవర్‌ను చితకబాదిన నటుడు సుప్రీత్.. కీసర పీఎస్‌లో కేసు నమోదు
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ క్యారక్టర్ ఆర్టిస్ట్ సుప్రీత్‌ (Supreeth) అలియాస్ కాట్రాజ్‌పై కీసర పోలీస్ స్టేషన్‌లో ఇవాళ కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే.. శ్రీహరి (Srihari) అనే క్యాబ్ డ్రైవర్ ఆదివారం రాత్రి తన ట్రిప్ పూర్తి చేసుకుని మరో బుకింగ్ కోసం నాగారం చౌరస్తాలో కారును రోడ్డు సైడ్‌కు పార్క్ చేసుకుని వెయిట్ చేస్తున్నాడు. అదే సమయంలో కారులో అటుగా వచ్చిన సుప్రీత్, శ్రీహరి దగ్గకు వెళ్లి కారును రోడ్డు అడ్డంగా పెట్టావంటూ కోపంతో ఊగిపోయి బూతులు తిడుతూ తనపై విచక్షణారహితంగా దాడికి పాల్పడినట్లుగా బాధితుడు పేర్కొన్నాడు. దీంతో శ్రీహరి తక్షణమే డయల్ 100కు కాల్ చేయగా పోలీసులు స్పాట్‌కు చేరుకుని గొడవను సద్దుమణిగేలా చేశారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇవాళ కీసర పోలీస్ స్టేషన్‌లో పలు సెక్షన్ల కింద నటుడు సుప్రీత్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు.

Next Story