- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హిందీ సినిమాలతో పోల్చుతూ సౌత్ సినిమాపై కాజల్ ప్రశంసలు
సౌత్ ఇండస్ట్రీ ప్రొఫెషనలిజం, మంచి కథలు, క్రియేటివిటీ పరంగా ఎంతో మెరుగ్గా ఉందని కాజల్ అగర్వాల్ ప్రశంసించింది.

దిశ, వెబ్ డెస్క్: తెలుగు సినిమాల ద్వారా కాజల్ అగర్వాల్ అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. అనంతరం ఇతర భాషల సినిమాల్లో కూడా నటించి దేశవ్యాప్తంగా మంచి క్రేజ్‌ను దక్కించుకుంది. తాజాగా కాజల్ అగర్వాల్ సౌత్ సినిమా ఇండస్ట్రీపై ప్రశంసల వర్షం కురిపించింది. కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ.. “ప్రొఫెషనలిజం విషయానికి వస్తే సౌత్ ఇండస్ట్రీ ఎంతో మెరుగ్గా ఉంటుంది. ఇక్కడ గొప్ప టెక్నీషియన్స్, అద్భుతమైన దర్శకులు, మంచి కథలు, క్రియేటివిటీ అన్నీ అద్భుతంగా ఉంటాయి” అని పేర్కొంది.
అలాగే, “ప్రస్తుతం సౌత్ సినిమాలకు వస్తున్న రీచ్ చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. చాలా హిందీ సినిమాల కంటే సౌత్ ఇండస్ట్రీ ఎంతో మెరుగ్గా రాణిస్తోంది” అని కాజల్ వ్యాఖ్యానించింది. ఇక కాజల్ ఎక్కువగా తెలుగు, తమిళ్, హిందీ చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ – గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘NBK 111’ (వర్కింగ్ టైటిల్) చిత్రంలో కాజల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి.






