- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఐలాపూర్ మిస్సింగ్ కేసులో విషాదం.. బావిలో శవమై తేలిన యువకుడు
జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలో మిస్సింగ్ కేసు ఘటనలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

దిశ, కోరుట్ల: జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలో మిస్సింగ్ కేసు ఘటనలో విషాద ఛాయలు అలుముకున్నాయి. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఐలాపూర్ గ్రామానికి చెందిన రాహుల్ అనే యువకుడు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. మే 27న రాహుల్ మిస్ అయినట్లు తల్లిదండ్రులకు తెలియడంతో హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కాగా రాహుల్ ఆచూకీ తెలిస్తే కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వాలని రాహుల్ కుటుంబ సభ్యులు ఓ వీడియో తీసి పలు వాట్సాప్ సోషల్ మీడియాలో సైతం షేర్ చేశారు.
భద్రంగా తిరిగే వస్తాడు అనుకునే క్రమంలో గుండెలు పగిలే వార్త ఆ కుటుంబానికి చేరింది. గత నెల 27వ తేదీన మిస్ అయిన రాహుల్ ఈ రోజు(సోమవారం) ఒంగోలులోని సింగరాయకొండ దగ్గర ఓ బావిలో రాహుల్ మృతదేహం ఉందని కుటుంబ సభ్యులకు సమాచారం అందడంతో ఐలాపూర్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న రాహుల్ కుటుంబ సభ్యులు కర్నూల్ బయలుదేరారు. రాహుల్ ఆత్మహత్యపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.






