- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఎం హిట్లర్ కన్నా ఎక్కువ.. అతడో తాలిబాన్: టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత ఫైర్
ప్రభుత్వ స్కూళ్ల మూసివేత, ఇంటర్-డిగ్రీ అడ్మిషన్ల గందరగోళంపై తెలంగాణ రక్షణ సమితి (TRS) చీఫ్ కల్వకుంట్ల కవిత నిప్పులు చెరిగారు.

దిశ, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) హిట్లర్ కన్నా ఎక్కువని.. తాలిబాన్‌తో సమానమని తెలంగాణ రక్షణ సమితి (TRS) చీఫ్ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) ఆరోపించారు. రాష్ట్రంలో 27 వేల ప్రభుత్వ పాఠశాలలను 4 వేలకు కుదిస్తామన్న సీఎం వ్యాఖ్యలను తప్పుబడుతూ ఆమె సోషల్ మీడియా వేదికగా ఇవాళ ఓ వీడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ఆడపిల్లలు, నిరుపేదలను చదువులు దూరం చేసేందుకే ప్రభుత్వ స్కూళ్లు మూసేస్తామని సీఎం చెబుతున్నాడని ఫైర్ అయ్యారు. విద్యాశాఖను సర్కస్ లెక్క మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 27 వేల ప్రభుత్వ స్కూళ్లను మూసేసి 4 వేల పాఠశాలలు మాత్రమే నడిపిస్తానని అంటున్న రేవంత్ రెడ్డి హిట్లర్ మాత్రమే కాదు.. ఆయనో తాలిబాన్ అంటూ సెటైర్లు వేశారు.
ఈ ఏడాది ఇంటర్మీడియట్ ఉండదని సీఎం ప్రకటించిన మరుసటి రోజే అడ్మిషన్లకు ఇంటర్ బోర్డు అడ్మిషన్లు ఇచ్చిందని కవిత అన్నారు. జూనియర్ కాలేజీలు ప్రారంభమైన వారం గడుస్తున్నా.. ప్రభుత్వ, ప్రవేటు జూనియర్ కాలేజీలకు ఈ సర్కార్ కనీసం అఫిలియేషన్‌లు ఇవ్వలేదని తెలిపారు. డిగ్రీ అడ్మిషన్లను గందరగోళంగా మార్చేశారని, హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ కొన్ని కోర్సులను సిఫార్సు చేస్తే.. కమిషనరేట్ మాత్రం మరికొన్ని కోర్సులు రిఫర్ చేసిందన్నారు. అందులో ఏ ఒక్క కోర్సుకు కూడా యూనివర్సిటీలు అప్రూవల్ ఇవ్వలేదని, అయినా దోస్త్ అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. గురుకులాల్లో వంద మందికి పైగా విద్యార్థులు చనిపోయినా సీఎం కనీస సమీక్ష చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.11 వేల కోట్ల ఫీ రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకుండా విద్యార్థులకే ట్యూషన్ ఫీజులు ఇస్తామని చెప్పి జీవో నెంబర్ 7 తీసుకువచ్చారని.. దీంతో విద్యార్థులను ప్రైవేటు కాలేజీలు దోపిడీ చేసే ప్రమాదం ఉందని అన్నారు. అందుకే వెంటనే జీవో నెంబర్ 7ను రద్దు చేసి.. ఫీజుల నియంత్రణ చట్టాన్ని వెంటనే అమల్లోకి ప్రైవేటు స్కూళ్ల దోపిడీకి అడ్డుకట్ట వేయాలని కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.






