వంట గ్యాస్ కోసం బారులు తీరిన వినియోగదారులు

by Jakkula.Mamatha |

వంట గ్యాస్ సిలిండర్ల కోసం ఉదయం నుంచే వినియోగదారుల సేవ కేంద్రం వద్ద వినియోగదారులు నిరీక్షించక తప్పడం లేదు.

వంట గ్యాస్ కోసం బారులు తీరిన వినియోగదారులు
X

దిశ, డోర్నకల్: వంట గ్యాస్ సిలిండర్ల కోసం ఉదయం నుంచే వినియోగదారుల సేవ కేంద్రం వద్ద వినియోగదారులు నిరీక్షించక తప్పడం లేదు. గ్రామీణ ప్రాంతాల నుంచి చంటి పిల్లలతో కేంద్రం వద్ద బారులు తీరుతూ కనిపిస్తున్నారు. డోర్నకల్ పట్టణంలో మూడో మెయిన్‌లో గ్యాస్ కార్యాలయానికి వినియోగదారులు ఖాళీ సిలిండర్లతో పోటెత్తుతున్నారు. మొబైల్ ఫోన్‌కు బుకింగ్ సమాచారం ఆలస్యమే ఇందుకు కారణంగా తెలుస్తుంది. రోజుల తరబడి ప్రదక్షిణలు చేస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో సంబంధిత అధికారులు స్పందించి వినియోగదారుల నిరీక్షణకు ఉపశమనం కలిగించాలని కోరుతున్నారు.

Next Story