మృగశిర కార్తె ప్రారంభం.. చేపలకు భలే గిరాకీ

by Jakkula.Mamatha |

నేటి నుంచి మృగశిర కార్తె ప్రారంభం కావడంతో వినియోగదారులతో చేపల మార్కెట్‌లో సందడి కనిపిస్తుంది.

మృగశిర కార్తె ప్రారంభం.. చేపలకు భలే గిరాకీ
X

దిశ, వెంకటాపురం(నూగూరు): నేటి నుంచి మృగశిర కార్తె ప్రారంభం కావడంతో వినియోగదారులతో చేపల మార్కెట్‌లో సందడి కనిపిస్తుంది. కార్తె ప్రారంభం రోజు చేపలు తినాలి అనే నానుడి ఉండడంతో కొనుగోలుదారులు ఎగబడటంతో మార్కెట్లో అమ్మకాలు ఊపు అందుకున్నాయి. అమ్మకందారులు సైతం పెరిగారు. ఉదయం నుంచే కొనుగోలు దారులు చేపల దుకాణాల వద్ద బారులు తీరారు. ఇదే అదునుగా చేసుకున్న చేపల అమ్మకందార్లు కేజీకి రూ.50 రకాన్ని బట్టి 100 రూపాయలు రేట్లు అధికం చేసి అమ్మకాలు జరపడంతో డిమాండ్‌ని ఆసరాగా చేసుకొని అధిక ధరలకు అమ్మకందారులు అమ్మకాలు చేపట్టడం పట్ల కొనుగోలుదారులు అసహనం వ్యక్తం చేశారు.

Next Story