- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
152 పరుగులకు ఆఫ్గానిస్థాన్ ఆలౌట్.. అరంగేట్రంలోనే అదరగొట్టిన మానవ్ సుతార్
ఆఫ్గానిస్థాన్‌తో ఏకైక టెస్ట్‌లో భారత్ విజయం వైపునకు దూసుకెళ్తోంది.

దిశ, వెబ్‌డెస్క్: ముల్లాన్‌పూర్ వేదికగా అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా పట్టు బిగించింది. మూడో రోజు ఆటలో భారత బౌలర్ల ధాటికి అఫ్గాన్ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 152 పరుగులకే కుప్పకూలింది. దీంతో 412 పరుగుల భారీ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సాధించిన టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ప్రత్యర్థి జట్టుకు ఫాలోఆన్ విధించాడు. అదేవిధంగా భారత యువ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మానవ్ సుతార్ అరంగేట్రం (Debut)లోనే అదరగొట్టాడు. కేవలం 33 పరుగులిచ్చి 6 వికెట్లు నేలకూల్చాడు. పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ 3, వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్ దక్కించుకున్నారు. ఆఫ్గాన్ బ్యాటర్లలో రహ్మత్ షా ఒక్కడే 60 పరుగులతో ఒంటరి పోరాటం చేయగా మిగతా వారంతా చేతులెత్తేశారు.
భారత్ భారీ లీడ్..
అంతకు ముందు టాస్ గెలిచి మొదటి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా.. తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 564 పరుగుల భారీ స్కోరు వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (126), కేఎల్ రాహుల్ (100) అద్భుత సెంచరీలతో కదంతొక్కగా.. వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ (81), యువ ఓపెనర్ సాయి సుదర్శన్ (81), వాషింగ్టన్ సుందర్ (52 నాటౌట్) హాఫ్ సెంచరీలతో భారీ స్కోరులో కీలక పాత్ర పోషించారు. ఆఫ్ఘన్ బౌలర్లలో మహ్మద్ సలీం సఫీ 6 వికెట్లు పడగొట్టాడు. ఇక మూడో రోజు లంచ్ సమయానికే ఆఫ్గానిస్థాన్‌ను ఆలౌట్ చేసిన భారత్.. మ్యాచ్‌పై పట్టు బిగించింది. ఫాలోఆన్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ప్రత్యర్థిని రెండో ఇన్నింగ్స్‌లోనూ త్వరగా కట్టడి చేసి, మూడో రోజు ఆట ముగిసేలోపే ఇన్నింగ్స్ విజయాన్ని అందుకోవాలని భారత్ పట్టుదలతో ఉంది.






