డ్రగ్స్ నెట్‌వర్క్‌పై ‘ఈడీ’ మెరుపు దాడులు

by Malleboina Mahesh |

త్రిపురలో పట్టుబడిన 49 కిలోల మెథాంఫెటమైన్ డ్రగ్స్ కేసులో ఈడీ సోమవారం మిజోరం-మయన్మార్, త్రిపుర-బాంగ్లాదేశ్ సరిహద్దులతో పాటు బెంగాల్‌లోని పలు ప్రాంతాల్లో దాడులు చేసింది.

డ్రగ్స్ నెట్‌వర్క్‌పై ‘ఈడీ’ మెరుపు దాడులు
X

దిశ, వెబ్ డెస్క్: ముడు రాష్ట్రాల్లో డ్రగ్స్ నెట్‌వర్క్‌పై ‘ఈడీ’ మెరుపు దాడులు చేసింది. ఇటీవల నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) నమోదు చేసిన డ్రగ్స్ కేసు ఆధారంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) మనీలాండరింగ్ దర్యాప్తును వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA), 2002 లోని సెక్షన్ 17 నిబంధనల ప్రకారం సోమవారం మిజోరం-మయన్మార్ సరిహద్దు, త్రిపుర-బంగ్లాదేశ్ సరిహద్దు, పశ్చిమ బెంగాల్‌లోని నాలుగు కీలక ప్రాంతాల్లో అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. గత ఏడాది (ఆగస్టు 21, 2025న) త్రిపురలో భారీ ఎత్తున 49.101 కిలోల మెథాంఫెటమైన్, 40 గ్రాముల హెరాయిన్‌ను ఎన్‌సీబీ సీజ్ చేసిన వ్యవహారంలో ఈ దాడులు జరిగాయి.

అంతర్జాతీయ సరిహద్దులకు అత్యంత సమీపం అయిన త్రిపురలో బంగ్లాదేశ్ సరిహద్దుకు కేవలం 200 మీటర్ల దూరంలో ఉన్న లొకేషన్లలో, అలాగే మిజోరంలో మయన్మార్ సరిహద్దుకు కేవలం 500 మీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాల్లో ఈ తనిఖీలు చేపట్టడం గమనార్హం. మయన్మార్ నుండి మిజోరం మీదుగా త్రిపురకు మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్న ఒక అంతర్జాతీయ క్రాస్-బోర్డర్ సిండికేట్ ఈ నెట్‌వర్క్ వెనుక ఉన్నట్లు ఈడీ అధికారులు ప్రాథమిక విచారణలో గుర్తించారు. ఈ డ్రగ్స్ స్మగ్లింగ్ దందా ద్వారా ఆర్జించిన నేరపూరిత సొమ్మును వివిధ అక్రమ మార్గాల్లో మళ్లించినట్లు తెలుస్తోంది. కాగా ఈ దాడులకు సంభందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story