- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్టార్ ప్రొడ్యూసర్ చేతికి ‘నాగబంధం’ నైజాం థియేట్రికల్ హక్కులు
‘నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్’ మూవీ నైజాం థియేట్రికల్ హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు సొంతం చేసుకున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.

దిశ, వెబ్ డెస్క్: నిర్మాతగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న అభిషేక్ నామ ప్రస్తుతం విరాట్ కర్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో నభా నటేష్, ఐశ్వర్య మేనన్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమాను జూలై 3న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో చిత్రబృందం అన్ని ప్రాంతాల థియేట్రికల్ హక్కుల విక్రయ ప్రక్రియను వేగవంతం చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా నైజాం థియేట్రికల్ హక్కులను కూడా అమ్మినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీ నైజాం హక్కులను ప్రముఖ నిర్మాత, ఎస్వీసీ సంస్థ అధినేత దిల్ రాజు సొంతం చేసుకున్నట్లు వెల్లడించారు. నైజాం ప్రాంతంలో దిల్ రాజుకు బలమైన పంపిణీ వ్యవస్థ ఉండటంతో ఈ చిత్రానికి భారీ స్థాయిలో థియేటర్లు లభించే అవకాశముందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. జునైద్ కుమార్, అభే సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి నిర్మిస్తున్నారు.






