ఎయిర్‌పోర్ట్‌లో ఘోర ప్రమాదం.. ల్యాండింగ్ వేళ కూలిన అమెరికన్ జెట్

by Kema Shiva Kumar |   (  Updated:2026-06-08 03:05:11  IST  )

లా రోమనా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది.

ఎయిర్‌పోర్ట్‌లో ఘోర ప్రమాదం.. ల్యాండింగ్ వేళ కూలిన అమెరికన్ జెట్
X

దిశ, వెబ్‌డెస్క్: డొమినికన్ రిపబ్లిక్‌ (Dominican Republic)లో ఘోరం చోటుచేసుకుంది. లా రోమనా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో రన్‌వేపై ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నించిన ఒ అమెరికన్ రిజిస్టర్డ్ ప్రైవేట్ బిజినెస్ జెట్ ఒక్కసారిగా అదుపుతప్పి కూలిపోయింది. ఈ దుర్ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న పైలట్, కో పైలట్ అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. అయితే, హిగువే నగర పరిధిలోని లా రోమనా ఎయిర్‌పోర్ట్‌ (La Romana Airport)లో ఈ ఘటన చోటుచేసుకుంది. విమానాన్ని రన్‌వేపై సురక్షితంగా దించేందుకు పైలట్లు చేసిన ప్రయత్నం విఫలమైంది. ల్యాండింగ్ సమయంలో నియంత్రణ కోల్పోయిన సదరు బిజినెస్ జెట్.. రన్‌వే పక్కకు దూసుకెళ్లి క్షణాల వ్యవధిలోనే పెద్ద శబ్దంతో పేలిపోయింది. విమానం ఇంధన ట్యాంకులకు నిప్పు అంటుకోవడంతో క్షణాల్లోనే విమానమంతా మంటలు వ్యాపించి నిప్పుల ముద్దగా మారింది. ఈ ప్రమాదానికి సంబంధించిన షాకింగ్ విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అయితే, ప్రమాదం జరిగిన వెంటనే విమానాశ్రయంలో హై అలర్ట్ ప్రకటించారు. ఎయిర్‌పోర్ట్ ఫైర్ ఫైటర్లు, అత్యవసర రెస్క్యూ బృందాలు క్షేత్రస్థాయికి చేరుకుని రసాయన ఫోమ్, నీటితో మంటలను అదుపు చేయడానికి శ్రమించాయి. అయితే అప్పటికే విమానం పూర్తిగా ధ్వంసమవడంతో లోపల ఉన్న ఇద్దరినీ కాపాడలేకపోయారు. ఈ విమాన ప్రమాదానికి దారితీసిన సాంకేతిక లోపాలు, వాతావరణ పరిస్థితులపై డొమినికన్ రిపబ్లిక్ విమానయాన అధికారులు తక్షణ విచారణకు ఆదేశించారు

Next Story