ప్రైవేట్ ​స్కూళ్ల ఫీజుల దోపిడీ..!

by Jakkula.Mamatha |

జమ్మికుంటలో విద్యను వ్యాపారంగా మార్చుకుని ప్రైవేటు ​పాఠశాలల యజమానులు స్కూళ్లను నడిపిస్తున్నారు.

ప్రైవేట్ ​స్కూళ్ల ఫీజుల దోపిడీ..!
X

దిశ,జమ్మికుంట: జమ్మికుంటలో విద్యను వ్యాపారంగా మార్చుకుని ప్రైవేటు ​పాఠశాలల యజమానులు స్కూళ్లను నడిపిస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వేలల్లో ఫీజులు దండుకుంటున్నారు. ఇక తమ పాఠశాలల్లో చదివే విద్యార్థులు తమ రూల్స్‌ను తప్పక పాటించాల్సిందే అన్నట్లుగా యాజమాన్యాలు వ్యవహరిస్తున్నాయి. ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు సరికొత్త తరహాలో విద్యార్థుల తల్లిదండ్రుల జేబులను గుల్ల చేస్తున్నారు. తమ పిల్లలను బాగా చదివించి, ప్రయోజకులను చేయించాలని కలలు కంటున్న విద్యార్థుల తల్లిదండ్రులు వారి పిల్లల చదువు కోసం కష్టపడి సంపాదించినదంతా ఖర్చు చేయాల్సిన పరిస్థితులు తలెత్తాయి.

విద్యార్థుల తల్లిదండ్రుల ఆశలను ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు క్యాష్ చేసుకుంటున్నాయి. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండల కేంద్రంలోని ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు.. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి భారీ మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఒక్కో విద్యార్థి నుంచి స్కూల్ ఫీజ్, వ్యాన్ ఫీజు, పరీక్ష ఫీజు, ఇతరత్రా కల్చరల్ యాక్టివిటీస్ పేరుతో వేలల్లో ఫీజులు వసూలు చేస్తూ.. వారి తల్లిదండ్రులపై భారం మోపుతున్నాయి. ఇక ఇవి చాలవన్నట్లు జమ్మికుంట పట్టణంలోని పలు ప్రైవేట్ పాఠశాలలు బుక్ స్టాల్స్‌తో కుమ్మక్కై.. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి నిలువు దోపిడీకి పాల్పడుతున్నాయి.

బుక్ స్టాల్స్‌తో కుమ్మక్కై.. దోపిడీ!

జమ్మికుంట పట్టణంలోని ప్రైవేట్ స్కూళ్లు తమ పాఠశాలలో చదివే విద్యార్థుల తల్లిదండ్రులను నిలువునా దోపిడీ చేస్తున్నాయి. ఏ ప్రైవేట్ స్కూళ్లలో చదివే విద్యార్థులు ఆయా పాఠశాలలు నిర్ధేశించిన బుక్ స్టాల్స్‌లోనే పుస్తకాలు కొనుగోలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. ఆయా పాఠశాలలకు సంబంధించిన పుస్తకాలు కేవలం వారి కనుసన్నల్లో నడిచే బుక్ స్టాల్స్‌లో మాత్రమే లభిస్తున్నాయి. ఆ పుస్తకాలు ఇతర ఏ బుక్ స్టాల్‌లో కూడా లభించని పరిస్థితి నెలకొంది. అంతేకాదు ఆయా బుక్ స్టాల్స్‌లో లభించే ఒక్కో పుస్తకం ఖరీదు వేలల్లో ఉంటుందంటే అతిశయోక్తి లేదు. కేవలం నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ విద్యార్థులకే ఒక్కొక్కరికీ దాదాపు రూ.4,500 నుంచి రూ.5,500 వరకు పుస్తకాలకే వెచ్చించాల్సిన పరిస్థితి నెలకొంది. ఒక నర్సరీ విద్యార్థి చదివే పుస్తకానికి వేల రూపాయలు ఉంటాయా? కేవలం వందల రూపాయలు ఉండాల్సిన పుస్తకాల విలువను వేలకు పెంచి, సదరు బుక్ స్టాల్ యాజమాన్యాలతో పాఠశాలల యాజమాన్యాలు కుమ్మక్కై.. చేస్తున్న నిలువు దోపిడీకి ఇది నిదర్శనం.

అంతా విద్యాశాఖ అధికారుల కనుసన్నల్లోనే..?

బుక్ స్టాల్స్‌తో కుమ్మక్కై ప్రైవేట్ పాఠశాలలు చేస్తున్న ఈ తరహా దోపిడీని విద్యాశాఖ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. విద్యాశాఖ అధికారుల కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతోందా.? లేక వారికి అందాల్సిన మామూళ్లు అందితేనే ఈ వ్యవహారాన్ని చూసీచూడనట్లు అధికారులు వ్యవహరిస్తున్నారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏదేమైనా.. ప్రైవేట్ పాఠశాలలు ఓ వైపు అధిక ఫీజులు వసూలు చేస్తూ.. మరోవైపు.. బుక్ స్టాల్స్ పేరుతో సరికొత్త తరహాలో దోపిడీకి పాల్పడుతుండటంతో.. విద్యార్థుల తల్లిదండ్రుల జేబులు గుల్ల అవుతున్నాయి. 2026-27 వార్షిక విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతోంది. మరి ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు ప్రైవేట్ స్కూళ్ల దోపిడీకి చెక్ పెట్టే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తారా.? లేదా.? అన్నది చూడాలి.

విద్యార్థుల తల్లిదండ్రుల ఆశలను ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు క్యాష్ చేసుకుంటున్నాయి. జమ్మికుంటలో ప్రైవేట్ ​పాఠశాలల యజమానులు విద్యను వ్యాపారంగా మార్చుకుని స్కూళ్లను నడిపిస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వేలల్లో ఫీజులు దండుకుంటున్నారు. ఇష్టారాజ్యంగా నిబంధనలు విధించి తల్లిదండ్రులను ఆర్థిక భారానికి గురిచేస్తున్నారు. కేవలం నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ విద్యార్థులకే ఒక్కొక్కరికీ దాదాపు రూ.4,500 నుంచి రూ.5,500 వరకు పుస్తకాలకే వెచ్చించాల్సిన పరిస్థితి నెలకొంది.

కేవలం వందల రూపాయలు ఉండాల్సిన పుస్తకాల విలువను వేలకు పెంచి బుక్ స్టాల్ యాజమాన్యాలతో కుమ్మక్కై నిలువు దోపిడీ చేస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలలు చేస్తున్న ఈ తరహా దోపిడీని విద్యాశాఖ అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. విద్యాశాఖ అధికారుల కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతోందా? లేక వారికి అందాల్సిన మామూళ్లు అందితేనే ఈ వ్యవహారాన్ని చూసీచూడనట్లు అధికారులు వ్యవహరిస్తున్నారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇంకా ఐదు రోజుల్లో 2026-27 వార్షిక విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతోంది. మరి ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు ప్రైవేట్ స్కూళ్ల దోపిడీకి చెక్ పెట్టే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తారా? లేదా? అన్నది చూడాలి.

Next Story