నిరుద్యోగులకు మరో తీపికబురు.. 5 వేల పోలీసు ఉద్యోగాల భర్తీకి సన్నాహాలు

by Kema Shiva Kumar |

నిరుద్యోగులకు త్వరలోనే అదిరిపోయే గుడ్ న్యూస్ రానుంది. తెలంగాణలో 5 వేల పోలీసు ఉద్యోగాల భర్తీకి సన్నాహాలు మొదలయ్యాయి.

నిరుద్యోగులకు మరో తీపికబురు.. 5 వేల పోలీసు ఉద్యోగాల భర్తీకి సన్నాహాలు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు అతి త్వరలో తీపికబురు అందనుంది. తెలంగాణలో మొత్తం 5 వేల పోలీస్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీస్ నియామక ప్రక్రియలో వేగం పెంచినట్లుగా సమాచారం. స్పెషల్ పోలీస్ (Special Police), స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF) విభాగాల్లో మొత్తం 4,500 కానిస్టేబుల్ పోస్టులు, అలాగే 500 సబ్‌ ఇన్‌స్పెక్టర్ (SI) పోస్టులను భర్తీ చేయడానికి చర్యలు కొనసాగుతున్నాయి. ఈ నియామకాలకు సంబంధించి ఆర్థిక శాఖ నుంచి త్వరలోనే అనుమతులు లభించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

అయితే, ప్రస్తుతం తెలంగాణ పోలీస్ శాఖలో సుమారు 17 వేల ఖాళీలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. అందులో ఫస్ట్ ఫేజ్‌లో 5 వేల పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా సమాచారం. ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే నియామక ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం వరుసగా ఉద్యోగ నియామక ప్రకటనలు చేస్తుండటంతో నిరుద్యోగ యువతలో ఆశలు పెరిగాయి. ముఖ్యంగా పోలీస్ శాఖలో ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. నోటిఫికేషన్ విడుదలైన తర్వాత అర్హతలు, వయో పరిమితి, ఎంపిక విధానం, పరీక్ష తేదీలకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

Next Story