- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పైరవీలే ఫస్ట్.. ప్రజా సమస్యలు లాస్ట్! ఎమ్మెల్యేల తీరుపై సీఎం రేవంత్ ఫైర్?
తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేల తీరుపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.

దిశ, తెలంగాణ బ్యూరో: మెజార్టీ ఎమ్మెల్యేల వ్యవహారశైలీపై సీఎం రేవంత్ రెడ్డి గుర్రుగా ఉన్నట్టు తెలిసింది. నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారం కంటే, సొంత ప్రయోజనాల కోసమే ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారని అభిప్రాయంలో ఆయన ఉన్నట్టు సమాచారం. తన వద్దకు వచ్చిన ప్రతీసారి ఏదో ఒక పైరవీ పేపరు ఇవ్వడం ఎమ్మెల్యేలకు పరిపాటిగా మారిందంటూ ఆయన కొందరు సన్నిహితుల వద్ద అసహనం వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది. రాజకీయాల్లో రాణించాలని తపన కంటే, అవకాశం ఉన్నప్పుడే వెనుకేసుకోవాలని తాపత్రయం మెజార్టీ ఎమ్మెల్యేల్లో ఉందని ఆయన కామెంట్ చేసినట్టు సమాచారం.
ఆర్థిక ప్రయోజనాలపైనే ఆరాటం..
సహజంగా ఎమ్మెల్యేలు సీఎంను కలిసినప్పుడు తమ నియోజకవర్గంలోని సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లి, వాటిని పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తారు. అందుకు సంబంధించిన వినతిపత్రాలు, ప్రపోజల్స్‌ను ఆయనకు ఇస్తుంటారు. కానీ కాంగ్రెస్ లోని మెజార్టీ ఎమ్మెల్యేలు నియోజకవర్గంలోని సమస్యల గురించి అసలు ప్రస్తావించటం లేదని తెలిసింది. సీఎంను కలిసిన ప్రతిసారి ఏదో ఒక పైరవీ చేయ్యాలంటూ, అందుకు సంబంధించిన పేపర్లు ఇవ్వడం రొటీన్ గా మారినట్టు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు ఎమ్మెల్యేలు ప్రధానంగా భూ వివాదాలపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టి, అందుకు సంబంధించిన పేపర్లను తీసుకుని సీఎం వద్దకు వెళ్తున్నారని ఫిర్యాదులు ఉన్నాయి. అందుకోసం పదే పదే సీఎంను కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు చర్చ జరుగుతున్నది. కొందరు ఎమ్మెల్యేలు తమకు సన్నిహితులైన అధికారులకు పోస్టింగ్ ఇవ్వాలని ఒత్తిడి పెంచే ప్రయత్నాలు చేస్తుంటారని టాక్ ఉంది. సదరు అధికారుల ట్రాక్ రికార్డు సరిగా లేకున్నా అదే పనిగా పోస్టింగ్ కోసం లాబీయింగ్ చేస్తున్నారని ప్రచారం ఉంది. ఇంకొందరు ఎమ్మెల్యేలు ఏసీబీ కేసుల్లో ఇరుక్కున అధికారులపై చార్జెస్ లేకుండా చూడాలని సీఎంకు అప్పీలు చేస్తున్నట్టు తెలిసింది.
కలిస్తే ఓ సమస్య.. కలకపోతే మరో సమస్య..
అధికారంలోకి వచ్చిన కొత్తలో పని ఒత్తిడి కారణంగా సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలను రెగ్యులర్ గా కలిసేవారు కాదు. దీనితో ఎమ్మెల్యేలు తమకు టైమ్ ఇవ్వకపోతే ఎట్లా ? నియోజకవర్గంలోని సమస్యలను ఎవరికి చెప్పుకోవాలి ? అంటూ అవేదన చెందేవారు. దీనితో ప్రతిరోజు ఎమ్మెల్యేలను కలిసేందుకు రేవంత్ రెడ్డి షెడ్యూలు ఫిక్స్ చేసుకుని, ఆ సమయంలో తన వద్దకు వచ్చిన ప్రతి ఒక్క శాసనసభ్యుడిని విడివిడిగా కలుస్తున్నారు. ఆ టైమ్ లో మెజార్టీ మంది ఎమ్మెల్యేలు నియోజకవర్గంలోని సమస్యలు చెప్పట్లేదని అసహనం వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది. ‘నియోజకర్గంలోని సమస్యలు చెప్తే వెంటనే సంబంధిత అధికారులకు చెప్పి పరిష్కారం చూపొచ్చు. కానీ పైరవీల కోసమే వస్తున్నారు.. వచ్చిన ప్రతీసారి ఏదో ఒక కాగితం తెస్తరు..ఆ పని చెయ్యమని, ఈ పనిచెయ్యమని అడుగుతున్నరు’అంటూ ఆయన ఎమ్మెల్యేల ప్రవర్తన పట్ల తన సన్నిహితుల వద్ద కామెంట్ చేసినట్టు తెలిసింది. ఎమ్మెల్యేల పైరవీలను తప్పించుకునేందుకు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే సీఎం కలుస్తలేరని ప్రచారం చేస్తారేమోనని అనుమానంలో ఆయన ఉన్నట్టు సమాచారం.
మళ్లీ గెలవాలనే తపన కరువు..
కొత్తగా ఎన్నికైన మెజార్టీ ఎమ్మెల్యేల్లో రాజకీయాల్లో కొనసాగాలనే తపన కనిపించడం లేదని విమర్శలు ఉన్నాయి. మళ్లీ గెలవాలని టార్గెట్ ఉన్న నాయకులు నిత్యం నియోజకవర్గంలో అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరించడంపై ఫోకస్ పెడుతుంటారు. కానీ కాంగ్రెస్ లోని మెజార్టీ ఎమ్మెల్యేలు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు తాపత్రయపడుతున్నట్టు ప్రచారం ఉంది. అందుకోసం నియోజకవర్గంలోని భూ వివాదాల్లో జోక్యం చేసుకోవడం, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, బిల్డర్లతో చేతులు కలపడం, అధికారులపై అజమాయిషీ చెలాయిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.






