- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్కూళ్లకు వేసవి సెలవులు పొడిగింపు.. క్లారిటీ
ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు బిగ్ అలర్ట్. రాష్ట్రంలో పాఠశాలల పున: ప్రారంభంపై విద్యాశాఖ క్లారిటీ ఇచ్చింది.

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాఠశాల విద్యార్థులకు బిగ్ అలర్ట్. రాష్ట్రంలో పాఠశాలల పున: ప్రారంభంపై విద్యాశాఖ క్లారిటీ ఇచ్చింది. వేసవి సెలవులను పొడిగించే ప్రతిపాదన ఏదీ లేదని ఈ సందర్భంగా అధికారులు వెల్లడించారు. ముందుగా ప్రకటించినట్లే.. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ఈ నెల 12వ తేదీన పున: ప్రారంభం కానున్నట్లు స్పష్టం చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రులు టీచర్లు సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మకూడదని కీలక సూచనలు చేశారు. ఇది ఇలా ఉండగా తెలంగాణ రాష్ట్రంలో స్కూళ్ల రీ-ఓపెనింగ్ ను ఈ నెల 15వ తేదీకి వాయిదా వేశారు. ఈ నెల 13వ తేదీన రెండో శనివారం, 14వ తేదీన ఆదివారం కావడంతో వేసవి సెలవులను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ నెల 12వ తేదీన హాలిడే ఇచ్చినందుకు, మరో కిటుకు పెట్టింది సర్కార్. విద్యా సంవత్సరం నష్టపోకుండా జూలై 11వ తేదీన రెండో శనివారం తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపింది.






