Today Panchangam: ఈరోజే మృగశిర కార్తె ప్రారంభం.. శుభ అశుభ సమయాలు ఇక్కడ చూడండి!

by Jakkula.Mamatha |

రోజువారీ జీవితంలో సమయాలకు చాలా ప్రాధాన్యత ఉంటుందని పంచాంగ నిపుణులు చెబుతుంటారు.

Today Panchangam: ఈరోజే మృగశిర కార్తె ప్రారంభం.. శుభ అశుభ సమయాలు ఇక్కడ చూడండి!
X

దిశ, వెబ్ డెస్క్: రోజువారీ జీవితంలో సమయాలకు చాలా ప్రాధాన్యత ఉంటుందని పంచాంగ నిపుణులు చెబుతుంటారు. ఏదైనా శుభకార్యం లేదా దూర ప్రయాణాలకు బయలుదేరే ముందు చాలా మంది ఇవాళ సమయం ఎలా ఉంది. నూతన పనులకు ఈరోజు మంచిదేనా? అసలు మంచి ముహుర్తం ఎప్పుడు ఉందని పంచాంగ నిపుణులను సంప్రదించడం లేదా క్యాలెండర్‌లో చూస్తుండటం గమనిస్తూనే ఉంటాం. ఈ రోజు మృగశిర కార్తె ప్రారంభమై జూన్ 28న ముగుస్తుంది. తెలుగు పంచాంగం ప్రకారం.. సూర్యుడు మృగశిర నక్షత్రంలోకి ప్రవేశించే కాలాన్నే మృగశిర కార్తె అంటారు. ఈ తరుణంలో ఈ రోజు(జూన్ 08, 2026) సోమవారం నాటి తెలుగు పంచాంగం ఇక్కడ తెలుసుకోవచ్చు. ఈ రోజు తె. 05:44 గంటల నుంచి సూర్యోదయం మొదలవుతుంది. సాయంత్రం 06:45 గంటలకు సూర్యాస్తమయం అవుతుంది.

ఈరోజు శుభ సమయాలు

బ్రహ్మ ముహూర్తం సమయం : తెల్లవారుజామున 04:08 గంటల నుంచి ఉదయం 04:56 గంటల వరకు ఉంటుంది.

అమృత కాలం సమయం: రా.1:28 నుండి ఉ.3:06 వరకు ఉంటుంది.

అభిజిత్ ముహూర్తం సమయం : ఉ.11:49 నుండి మ.12:41 వరకు ఉంటుంది.

ఈ రోజు అశుభ సమయాలు

వర్జ్యం: మ.3:41 నుంచి సా.5:19 వరకు ఉంటుంది.

యమగండం సమయం: ఉ.10:37 నుండి మ.12:15 వరకు ఉంటుంది.

దుర్ముహూర్తం సమయం :మ.12:41 నుంచి మ.1:33 వరకు మ.3:17 నుంచి సా.4:09 వరకు ఉంటుంది.

రాహుకాలం సమయం : ఉ.07:22 నుంచి ఉ.09:00 వరకు ఉంటుంది.

గుళికాకాలం సమయం : మ.1:52 నుంచి మ.3:30 వరకు ఉంటుంది.

Next Story