- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాల్పుల విరమణ ఉల్లంఘన.. ఇజ్రాయెల్‌పై ఇరాన్ బాలిస్టిక్ మిసైళ్ల వర్షం
పశ్చిమాసియాలో యుద్ధం మళ్లీ రాజుకున్నది.

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమాసియా (West Asia)లో మళ్లీ యుద్ధ మేఘాలు ఆవహిస్తున్నాయి. ఇజ్రాయెల్ (Israel), ఇరాన్ (IRan) దేశాల మధ్య గత ఏప్రిల్ 8న కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ఒక్కసారిగా వీగిపోయింది. లెబనాన్ రాజధాని బీరుట్ (Beirut) లోని హిజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (IDF) జరిపిన భారీ వైమానిక దాడులకు ప్రతీకారంగా.. ఇరాన్ ఇవాళ తెల్లవారుజామున ఇజ్రాయెల్‌పై నేరుగా బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడింది. ఇరాన్ నుంచి వరుసగా దూసుకొచ్చిన క్షిపణుల కారణంగా ఉత్తర ఇజ్రాయెల్ వ్యాప్తంగా ఎయిర్ రైడ్ సైరన్లు మోగాయి. గలీలీ, రమత్ డేవిడ్ ఎయిర్ బేస్ పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనల మధ్య సురక్షిత ప్రాంతాలకు, బంకర్లలోకి పరుగులు తీశారు. ఇజ్రాయెల్ వైమానిక రక్షణ వ్యవస్థలు (Air Defence Systems) తక్షణమే స్పందించి క్షిపణులను అడ్డుకునే ప్రయత్నం చేశాయి. ఇజ్రాయెల్ సైన్యం (IDF) సమాచారం ప్రకారం.. ఇరాన్ ప్రయోగించిన దాదాపు 10 బాలిస్టిక్ క్షిపణులను వారు గాల్లోనే విజయవంతంగా కూల్చివేశారు. ప్రాణనష్టంపై ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
కాగా, బీరుట్‌పై ఇజ్రాయెల్ దాడి చేసి అన్ని రెడ్ లైన్స్ క్రాస్ చేసిందని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) స్పష్టం చేసింది. తాము ఇక్కడితో ఆగబోమని, రాబోయే 7 రోజుల పాటు నిరంతరాయంగా డ్రోన్లు, మిస్సైళ్లతో ఇజ్రాయెల్ టార్గెట్‌గా దాడులు కొనసాగిస్తామని ఇరాన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. పరిస్థితి తీవ్రతను గమనించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తక్షణమే రంగంలోకి దిగారు. ఆయన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు ఫోన్ చేసి మాట్లాడారు. ప్రస్తుతానికి ఇరాన్‌పై ఎలాంటి ఎదురుదాడి చేయవద్దని, దౌత్యపరమైన చర్చలకు ఆటంకం కలిగిస్తుందని నచ్చజెప్పినట్లుగా తెలుస్తోంది.






