- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రభుత్వ నిబంధనలకు పాతర.. పే అండ్ అకౌంట్స్ బదిలీల్లో ఇష్టారాజ్యం!
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల్లో చిత్ర విచిత్రాలు వెలుగు చూస్తున్నాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సౌకర్యార్ధం, పరిపాలన సౌలభ్యం కోసం చేపట్టిన బదిలీల ప్రక్రియను కొన్ని శాఖలు, కొందరు అధికారులు వాటికి అర్థాలు మార్చేసి ఇష్టారీతిన చేసేశారు. సుదీర్ఘ కాలం ఒకే దగ్గర ఉన్న వారిని బదిలీ చేయాలనే నిబంధనను అమలు చేస్తూనే ఆ నిబంధనల్లో ఉన్న లొసుగులు ఆధారంగా చేసుకొని బదిలీలకు కొత్త అర్థం చెప్పారు. ఒకే భవనంలో ఉన్న రెండు ఆఫీసులను రెండు కార్యాలయాలుగా చూపించి పై ఫ్లోర్‌నుంచి కింది ఫ్లోర్‌కు, కింది ఫ్లోర్‌నుంచి పై ఫ్లోర్‌కు బదిలీ చేశారు. ఈ చిత్ర విచిత్రాలు ఒక్కొక్కొటిగా వెలుగులోకి వస్తున్నాయి. బదిలీల అర్థాలను మారుస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో, మెమోను అపహాస్యం చేస్తూ బదిలీ చేపట్టడంపై విచారణ చేసి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
బదిలీలలు.. ఇలా
ఆర్థిక శాఖకు అనుబంధంగా వర్క్స్ అండ్ ప్రాజెక్టు విభాగం ఉంటుంది. దీని డైరెక్టరేట్ కార్యాలయం హైదరాబాద్ నాంపల్లి గృహకల్ప సముదాయంలో ఉంది. ఇక్కడ పే అండ్ అకౌంట్స్ కార్యాలయం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా కార్యాలయాలతో పాటుగా జాయింట్ డైరెక్టర్కార్యాలయం ఉంటుంది. ఈ మూడు కార్యాలయాలు నాంపల్లి గృహకల్ప సముదాయంలోనే ఒకే భవనంలో ఉన్నాయి. ఫ్లోర్ లు మాత్రమే తేడా. అదే కాంప్లెక్స్‌లో ఒకే భవనంలో వేరు వేరు ఫ్లోర్లలో ఉంటాయి. కానీ అధికారులు మాత్రం సీనియర్అసిస్టెంట్ల బదిలీలను మాత్రం ఫైఫ్లోర్ నుంచి కిందికి, కింది ఫ్లోర్ నుంచి పైకి మార్చారు. ఉద్యోగులకు స్థానచలనం అని బదిలీ ఆర్డర్ ఇచ్చారు. సీనియర్ అసిస్టెంట్లను జాయింట్డైరెక్టర్కార్యాలయం నుంచి మరో ఫ్లోర్లో ఉన్న పీఏవో హైదరాబాద్ కార్యాలయానికి, ఇటు నుంచి అటు బదిలీ చేశారు. మరికొందరిని రంగారెడ్డి పీఏవో నుంచి మేడ్చల్ కు, మేడ్చల్‌నుంచి రంగారెడ్డి పీఏవోకు మార్చారు. రంగారెడ్డి కార్యాలయం కూడా గృహకల్ప సముదాయంలోనే ఉంటుంది. ఇలా సాగింది ఆర్థిక శాఖకు అనుబంధంగా ఉన్న వర్స్క్అండ్ ప్రాజెక్టుల కార్యాలయాల అధికారలు పనితీరు. బదిలీలు అయ్యాయని చెప్పుకున్నారు. రికార్డుల్లో ఆ విధంగా చూపించారు.
నాంపల్లిలో మరోలా..
నాంపల్లిలో పే అండ్ అకౌంట్స్ కార్యాలయం హైదరాబాద్, రంగారెడ్డితో పాటుగా జాయింట్ డైరెక్టర్ కార్యాలయం ఉంది. మేడ్చల్ లో ఏపీఏవో కార్యాలయం ఉంది. ఈ నాలుగు కార్యాలయాలను ఒకే యూనిట్‌గా పరిగణలోకి తీసుకోవాలని, ఈ నాలుగింటిలో ఏ కార్యాలయంలో పనిచేసినా కూడా ఒకే సీనియార్టీగా లెక్కించి ఉద్యోగుల బదిలీ అర్హత సీనియార్టీని నిర్ణయించాలని, 2024 జూలై 12న ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కానీ అధికారులు మాత్రం ప్రభుత్వ ఆదేశాలను తుంగలో తొక్కారు. లిఖిత పూర్వక ఆదేశాలకు విరుద్దంగా వ్యవహరించారు. సూపరిటెండెంట్బదిలీల్లో హైదరాబాద్‌నుంచి మేడ్చల్ కు బదిలీ చేశారు. మేడ్చల్‌నుంచి హైదరాబాద్‌కు బదిలీ చేశారు. మిగిలిన వారిని హైదరాబాద్ నాంపల్లి కార్యాలయంలోనే అదే స్థానాల్లో కొనసాగించారు. వారు ఉద్యోగ సంఘాల ఆఫీస్ బేరర్స్ కాబట్టి వారిని అక్కడే కొనసాగిస్తున్నట్టుగా ఆదేశాల్లో పేర్కొన్నారు. దీనితో ఏపీఏవో వికారాబాద్, సంగారెడ్డి కార్యాలయాల్లో పనిచేస్తున్న వారెవరు కూడా హైదాబాద్ నగరానికి వచ్చే అవకాశాలు లేకుండా అధికారుల బదిలీల తీరు కొనసాగిందనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ జీవో, మెమోను స్పష్టంగా ఉల్లంఘిస్తూ ఇచ్చిన ఆదేశాలపై ప్రభుత్వం విచారణ చేసి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ బదిలీల్లో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినట్టుగా కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి.






