- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫైట్లు చేస్తే రాని వాళ్లు.. సమంతతో రొమాన్స్ అనగానే క్యూ కట్టారు! హీరోకు చెమటలు పట్టించిన 200 మంది.
సెట్‌లో దాదాపు 200 మంది దాకా క్రూ ఉండేవారు. నేను ఎండలో కష్టపడి భారీ ఫైట్లు చేస్తున్నా, చెమటలు చిందేలా డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నా.. ఒక్కడంటే ఒక్కడు కూడా నా వైపు తిరిగి చూసేవాడు కాదు.

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda Sai Srinivas), తన కెరీర్ మొదట్లో ఎదురైన ఒక క్రేజీ సంఘటనను బయటపెట్టారు. అది ఆయన మొదటి సినిమా ‘అల్లుడు శీను’ షూటింగ్ సమయం. అప్పట్లో టాప్ హీరోయిన్‌గా ఉన్న సమంత(Samantha)తో రొమాన్స్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అయితే సెట్‌లో జరిగిన ఒక వింత పరిస్థితి శ్రీనివాస్‌ను బాగా ఇబ్బంది పెట్టిందట. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో శ్రీనివాస్ నవ్వుతూ ఇలా చెప్పుకొచ్చారు: ‘‘సెట్‌లో దాదాపు 200 మంది దాకా క్రూ ఉండేవారు. నేను ఎండలో కష్టపడి భారీ ఫైట్లు చేస్తున్నా, చెమటలు చిందేలా డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నా.. ఒక్కడంటే ఒక్కడు కూడా నా వైపు తిరిగి చూసేవాడు కాదు. అందరూ వాళ్ల పనుల్లో వాళ్లు బిజీగా ఉండేవారు.
కానీ సీన్ మారుతుందంటే చాలు.. సెట్‌లో వాతావరణం మారిపోయేది. ఎప్పుడైతే సమంతతో రొమాంటిక్ సీన్ లేదా కిస్సింగ్ సీన్ షూట్ చేయాలని డైరెక్టర్ వి.వి. వినాయక్ గారు అనౌన్స్ చేస్తారో.. అప్పుడు ఎక్కడ ఉన్నవాళ్లు అక్కడ పనులు ఆపేసి సెట్ దగ్గరకు వచ్చేసేవారు. ఆ 200 మంది గుంపుగా వచ్చి, కళ్లు అప్పగించి ఆ సీన్ చూస్తుంటే నాకు చాలా అసౌకర్యంగా అనిపించేది. మొదటి సినిమా కావడంతో ఒక పక్క సిగ్గు, మరోపక్క అంతమంది చూస్తున్నారనే టెన్షన్.. నిజంగా అది మర్చిపోలేని అనుభవం’’ అని శ్రీనివాస్ సరదాగా చెప్పుకొచ్చారు. సమంత లాంటి స్టార్ హీరోయిన్‌తో మొదటి సినిమాలోనే అంతటి రొమాంటిక్ కెమిస్ట్రీ పండించడం అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది. శ్రీనివాస్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు కూడా క్రేజీ కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా ఆ సినిమాలోని వీరిద్దరి జోడీ బాక్సాఫీస్ వద్ద అప్పట్లో కాసుల వర్షం కురిపించింది.






